ప్రేమతో మీ కార్తీక్ అని వచ్చినా ఎవరు పట్టించుకోకపోవడంతో RX 100 సినిమాతో యువతని ఉర్రూతలూగించేలా చేశాడు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ. RX 100 సక్సెస్ తో అతనికి ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతోనే హిప్పీ, గుణ 369 లాంటి సినిమాలు చేశాడు. నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడి పాత్ర కూడా చేశాడు కార్తికేయ.
ఆ తర్వాత 90ML, రాజా విక్రమార్క, చావు కబురు చల్లగా సినిమాలు చేశాడు. కెరీర్ గాడి తప్పుతుంది సరిచేసుకోవాల్సిన టైం వచ్చింది అనుకున్న టైం లోనే బెదురులంక 2012 సినిమా చేశాడు కార్తికేయ. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా కార్తికేయ వరుస ఫ్లాపుల తాకిడికి బ్రేక్ వేసింది.
ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే భజే వాయు వేగం పూర్తి చేశాడు. బెదురులంక లా కాదు కానీ భజే వాయు వేగం కూడా కార్తికేయను పర్వాలేదనేలా చేసింది. తనకు వచ్చిన ఈ గుర్తింపుకి ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకూడదు కాస్త టైం తీసుకున్నా మంచి కథతో రావాలని చూస్తున్నాడు కార్తికేయ. ఐతే కాస్త గ్యాప్ ఇస్తే చాలు పరిశ్రమలో వేరే వాళ్లు వచ్చి దూరేస్తారు. ఇలా ఒక సినిమాకు రెండు మూడేళ్ల గ్యాప్ యువ హీరోల కెరీర్ కి ముప్పుగా మారే అవకాశం ఉంటుంది.
2024లో భజే వాయు వేగం సినిమా రాగా 2025లో కార్తికేయ సినిమా ఒక్కటి రాలేదు. కనీసం ఏదైనా సినిమా సెట్స్ మీద ఉందా అన్న విషయం కూడా బయటకు రానివ్వలేదు. సినిమా అంతా పూర్తి చేసి టీజర్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనే ప్లాన్ తోనే కార్తికేయ ఇలా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. భజే వాయు వేగం సినిమాకు ఇదే తరహా ప్లాన్ చేశారు. అది ఎలాగు సక్సెస్ అయ్యింది కాబట్టి తర్వాత సినిమాకు కూడా ఇదే పంథా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.
కార్తికేయ కథల విషయంలో టైం తీసుకోవడం మంచిదే కానీ మరీ ఆలస్యం అయితే మాత్రం అమృతం అవ్వాల్సింది కాస్త విషం అవుతుందన్నది మర్చిపోకూడదు. ఒకప్పటిలా ఎలాంటి సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారన్న ఆలోచన లేదు. ఐతే మరీ ఆలస్యం అయినా కూడా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దాదాపు ఏడాది పాటుగా సైలెంట్ గా ఉన్న కార్తికేయ తన కొత్త సినిమా ప్రకటనతో ఎప్పుడొస్తాడని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
This post was last modified on February 17, 2026 12:49 pm
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…