ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని స్కంద విడుదల తేదీ సెప్టెంబర్ 15 కేవలం తొమ్మిది రోజుల దూరంలో ఉంది. హఠాత్తుగా టీమ్ మౌనం పాటించడం పట్ల ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. సలార్ వదిలేసుకున్న తేదీకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో రామ్, నిర్మాత ఏకాభిప్రాయంలో ఉన్నా బోయపాటి శీను మాత్రం గణేషుడి పండక్కే ఫిక్సవుదామని చెప్పినా ఫైనల్ గా సెప్టెంబర్ 28నే లాక్ చేసుకున్నారు. ఈ నిర్ణయం వల్లే ప్రమోషన్లు తాత్కాలికంగా హోల్డ్ చేసినట్టు సమాచారం. తమన్ తాజాగా కొత్త లిరికల్ వీడియో గురించి చిన్న అప్డేట్ ఇవ్వడం మినహాయించి అంతకు మించిన మూమెంట్ ఈ మధ్య లేదు.
ఎలాగూ కొత్త డేట్ తీసుకుంది కనక స్కంద సౌండ్ కంటిన్యూగా వినిపించాలి. ట్రైలర్ వచ్చాక నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చిన వాస్తవం రామ్ తో సహా అందరి దృష్టిలోనూ ఉంది. ఓవర్ మాస్ ఎలిమెంట్స్ తో కంటెంట్ ని ప్రేక్షకులు ఇంకోలా అర్థం చేసుకునే అవకాశమిచ్చిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. సోషల్ మీడియాలో ఏకంగా వినయ విధేయ రామతో పోలిక తెచ్చారంటేనే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో విశ్లేషించుకోవాలి. దీని కోసం కొత్తగా మరో ట్రైలర్ వెర్షన్ సిద్ధం చేయాలి. యూనిట్ ఆ పనిలోనే ఉన్నట్టు వినికిడి. విడుదల తేదీ ఖరారు చేసేశారు కాబట్టి పనుల స్పీడ్ పెంచొచ్చు.
చూసేకొద్దీ రోజులు కర్పూరంలా కరిగిపోతాయి. ఇరవై ఎనిమిదిన మ్యాడ్, రూల్స్ రంజన్ ఉన్నా వాటి ప్రభావం రామ్ మీద పెద్దగా ఉండదు. ఒక రోజు ఆలస్యంగా 29న పెదకాపు పార్ట్ 1 వస్తుందట. అప్పటిదాకా ఎన్ని నిర్ణయాలు మారతాయో చెప్పలేం. స్కంద పండగ అడ్వాంటేజ్ ని పూర్తిగా వదులుకున్నప్పటికీ సలార్ టార్గెట్ చేసుకున్న లాంగ్ వీకెండ్ ని వాడుకునే ఛాన్స్ దొరికింది. సరిగ్గా పబ్లిసిటీ చేసుకుంటే మాస్ ఆడియన్స్ నుంచి మద్దతు ఫుల్ గా ఉంటుంది. రామ్-శ్రీలీల-తమన్-బోయపాటి శీను లాంటి క్రేజీ కాంబోతో వస్తున్న మూవీ కావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది.
This post was last modified on September 4, 2023 5:53 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…