హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే కోలీవుడ్ లో సెటిలైన తెలుగువాడిగా విశాల్ కు ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. మార్కెట్ తగ్గినప్పటికీ తన సినిమా వస్తోందంటే ఆసక్తికరంగా ఎదురు చూసే అభిమానులున్నారు. కొంత కాలంగా రెగ్యులర్ మూసలో పడిపోయి పరాజయాలు చూస్తున్న విశాల్ కొత్త మూవీ మార్క్ ఆంథోనీ ఈ నెల 15 విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం హీరో చాలా వేషాలే వేశాడు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల వీడియోలో అరటి పండు ఒలిచినట్టు కథేంటో చెప్పేశారు.
ఓ మూడు దశాబ్దాల క్రితం జనాన్ని గడగడలాడించిన ఆంథోనీ(విశాల్), అతని ప్రాణ స్నేహితుడు(ఎస్జె సూర్య) మాఫియాని గుప్పిట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు ఏ రూపంలో ఉంటారో అర్థం కాని తెలివితేటలతో శత్రువులను బురిడీ కొట్టిస్తుంటారు. వర్తమానంలో మార్క్ (ఆంటోనీ) తన చిన్ననాటి వ్యక్తులకు ఫోన్ ద్వారా కలుసుకునే టైం మెషీన్ ని చూస్తాడు. దీంతో ఆంథోనీతో పాటు వాడి ఫ్రెండ్ ని కలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తీరా చూస్తే ఈ ఇద్దరు రౌడీలు బ్రతికే ఉంటారు. వయసయ్యాక మార్క్ తో తలపడేందుకు సిద్ధపడతారు. తర్వాత ఏం జరిగిందో తెరమీద చూడమంటున్నారు.
కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. టైం ట్రావెల్ తో ఆ మధ్య శర్వానంద్ ఒకే ఒక జీవితం వచ్చింది. అది ఎమోషనల్ డ్రామా. అదే పాయింట్ ని తీసుకుని మార్క్ ఆంథోనీని ఫుల్ యాక్షన్ మసాలాగా మార్చాడు ఆధిక్ రవిచంద్రన్. భారీ బడ్జెట్గ్ ఖర్చు పెట్టినట్టు విజువల్స్ చూస్తే చెప్పొచ్చు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, రామానుజం ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. రామ్ స్కంద, లారెన్స్ చంద్రముఖి 2తో పోటీ పడబోతున్న మార్క్ ఆంథోనీ హిట్టు కొట్టడం విశాల్ కు చాలా కీలకం. వెరైటీగానే కనిపిస్తోంది. కంటెంట్ కూడా అలాగే ఉంటే సక్సెస్ దక్కినట్టే.
This post was last modified on September 4, 2023 12:02 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…