అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికి “స్టార్ మా” సెప్టెంబర్ 3 న తెరతీయబోతోంది. అది “బిగ్ బాస్”.
ఆరు విజయవంతమైన సీజన్స్ ముగించుకుని ఏడో సీజన్ ఆ రోజున రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ అవుతోంది. ప్రేక్షకులు అందరికీ ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసేందుకు సర్వాంగ సుందరంగా.. అంగరంగ వైభవంగా రాబోతున్న ఈ గ్రాండియర్ ఈవెంట్ – అద్భుతం ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించబోతోంది.
స్టార్ మా లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9. 30 గంటలకు ప్రతి తెలుగింట్లో ప్రేక్షకుల్ని కట్టిపడెయ్యబోతోంది. శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు చూడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రం 24 X 7 స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. అంచనాలకు అందని ఈ కొత్త ఫార్మాట్ ని మరింత విన్నూతంగా విలక్షణంగా నడిపించడానికి కింగ్ నాగార్జున సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు.
షో హోస్ట్ గా నాగార్జున తనదైన స్టయిల్ లో హౌస్ ని డీల్ చేయబోతున్నారు. ఉల్టా పుల్టా అంటే ఏంటో? అసలు హౌస్ లో ఏం జరుగుతుందో? అసలు ఎలాంటి క్లూ అందడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలు స్టార్ లో ప్రసారమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఇదే చర్చ జరుగుతోంది.
ప్రతి సీజన్ మొదలవుతున్నప్పుడు – హౌస్ లోకి ఎవరు రాబోతున్నారని ప్రేక్షకుల్లో వుండే అంచనాలు, ఊహాగానాలు ఎలా వున్నా, వాటిలో నిజానిజాలు తేలిపోనున్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి భిన్నంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.
“బిగ్ బాస్ సీజన్ 7” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/KeSwdejIfHU?si=Aijejl9SuLe6woxk
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates