పవర్ స్టార్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతోంది. ఓవైపు పవన్ పాత సినిమా ‘గుడుంబా శంకర్’ స్పెషల్ షోలతో అభిమానులు బయట సందడి చేస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్లో ఎటు చూసినా పవన్ గురించే చర్చ కనిపిస్తోంది. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ అన్నీ పవన్ మీద, ఆయన సినిమాల మీదే ఉన్నాయి. నిన్న రాత్రి సడెన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి కొత్త లుక్ లాంచ్ చేశారు.
అందులో పవన్ లుక్ పవర్‌ఫుల్‌గా కనిపించింది. కీరవాణి గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆ పోస్టర్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఇక ఉదయం అయితే సోషల్ మీడియాను షేక్ చేసేలా ‘ఓజీ’ టీజర్ వచ్చి మోత మోగించేసింది. ఇక సాయంత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కొత్త లుక్ లాంచ్ చేశారు. మొత్తంగా పవన్ అభిమానుల సంబరం ఈ రోజు మామూలుగా లేదు.
ఐతే పవన్ కొత్త చిత్రాల నుంచి విశేషాలను పంచుకోవడం వరకు బాగానే ఉంది కానీ.. వీటిలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందనే స్పష్టత లేదు. ఆ విషయంలో ఆయా చిత్ర బృందాలకు సైతం క్లారిటీ లేదు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలైంది. చాలాసార్లు ఆ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. గత ఏడాది చకచకా కొన్ని వారాలు షూటింగ్ చేశారు. తర్వాత ఏమైందో తెలియదు. సినిమా వార్తల్లో లేకుండా పోయింది. పవన్ వేరే సినిమాలకు ఇచ్చిన ప్రయారిటీ దీనికి ఇవ్వట్లేదు. ఈ సినిమా బయటికి రాదేమో అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. కానీ ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేసి తాము బరిలోనే ఉన్నామని చాటింది చిత్ర బృందం.
కానీ పోస్టర్ మీద రిలీజ్ గురించి కబురేమీ లేదు. ఇక ‘ఓజీ’ షూటింగ్ చాలా వరకు పూర్తయిన విషయం టీజర్ చూస్తేనే అర్థమైంది కానీ.. ఆ సినిమా రిలీజ్ మీదా క్లారిటీ లేదు. పవన్ ఇంకో మూడు వారాల డేట్లు ఇస్తే తప్ప సినిమా పూర్తవదు. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియదు కాబట్టే టీజర్లో కూడా రిలీజ్ గురించి హింట్ ఏమీ లేదు. ఈ రోజు సాయంత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ కూడా ఇదే రకంగా ఉంది.. విడుదల సంగతి ప్రస్తావించలేదు.
This post was last modified on September 2, 2023 10:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…