పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత వారం రోజులుగా విపరీత జ్వరానికి గురవుతున్నది ఓజి టీజర్ కోసమే అంటే అతిశయోక్తి కాదు. అయిదేళ్ల తర్వాత తమ అభిమాన హీరో చేస్తున్న స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలను ఆకాశంలో పెట్టుకుని చూస్తున్నారు. ఈ భారీ గ్యాంగ్ స్టర్ మూవీని నిర్మిస్తున్న డివివి ఎంటర్ టైన్మెంట్స్ క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడంతో హైప్ విషయంలో అంతకంతా పెరుగుదలే తప్ప డౌన్ ట్రెండ్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఇవాళ వచ్చిన 100 సెకండ్ల టీజర్ కోసం ఓ రేంజ్ లో హడావిడి నడుస్తోంది. ఇంతకది ఫీవర్ ని పెంచేలా ఉందా
అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ లో వీడియో మొత్తం ఎలివేషన్లతో నిండిపోయింది. పదేళ్ల క్రితం ముంబైకి వరదలు వచ్చినప్పుడు మట్టి చెట్లు అన్నీ కొట్టుకుపోయాయి కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఏ వరదలూ తుడవలేదని చెప్పించి, కత్తితో ఒక్కొక్కరిని ఊచకోత కోస్తున్న పవన్ ని సైడ్ షాట్స్ చూపిస్తూ, ఆ తర్వాత తుపాకీ పట్టుకుని అసలు ఓజిని దర్శనం చేయించడం ద్వారా దర్శకుడు సుజిత్ గూస్ బంప్స్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. కెజిఎఫ్ తరహాలో మాటలు వింటేనే ఒళ్ళు జలదరించినట్టు డిజైన్ చేసుకున్న షాట్స్ చాలా బాగా ఆకట్టుకునేలా వచ్చాయి
ఫ్యాన్స్ కోరుకున్నట్టే పవన్ ఊర మాస్ గ్యాంగ్ స్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో పేలింది. తమన్ ఎంత మాత్రం నిరాశపరిచే ఛాన్స్ ఇవ్వకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. పుట్టినరోజుకి సరైన కానుకే ఇచ్చాడు. వీడియో చివర్లో పోలీస్ స్టేషన్ లో పవన్ మరాఠి భాషలో కేకలు వేస్తూ కత్తిని తీసుకుని టేబుల్ మధ్యలో దించే సన్నివేశం ఇంకో స్థాయిలో ఉంది. మొత్తానికి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడంలో దర్శకుడు సుజిత్ లోని వీరాభిమాని వంద మార్కులు తెచ్చేసుకున్నాడు. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ఫైర్ స్టార్మ్ కమింగ్ అని హింట్ తో ముగించేయడం కొసమెరుపు.
This post was last modified on September 2, 2023 11:02 am
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…