పబ్లిక్ స్టేజిల మీద ఏదైనా మాట్లాడేటప్పుడు ఏ మాత్రం నాలుక స్లిప్ అయినా దాని పరిణామాలు ఒక్కోసారి ఊహించనంత దూరం వెళ్లిపోతాయి. క్షమాపణ చెప్పే దాకా దారి తీయొచ్చు. కొన్నేళ్ల క్రితం ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మాయిల గురించి చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపింది. దానికి కొడుకు సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదే పొరపాటు మన పెద్ద హీరోలు చేస్తే నెటిజెన్లు ఏ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. కానీ షారుఖ్ ఖాన్ వేసిన ఒక జోకు మాత్రం ముందు ఏదో సరదాగా అనిపించినా అర్థం తెలిశాక షాక్ కొట్టేలా ఉంది.
మొన్న జరిగిన జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షారుఖ్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ టైంలోనే దర్శకుడు ఆట్లీ దంపతులకు బిడ్డ జన్మించిందని, మూవీ తమ జాయింట్ ప్రొడక్షన్ అయినా బేబీ మాత్రం వాళ్ళిద్దరిదనేని, తన ప్రమేయం లేదని జోకేశాడు. ముందు పగలబడి నవ్వుకున్నా నిజానికందులో చాలా విచిత్రమైన అర్థం ఉంది. శుభాకాంక్షలు చెప్తే పోయేదానికి దాన్నేదో కామెడీగా చెప్పాలన్న ఉద్దేశంతో అన్న మాటలు ఒకరకంగా మిస్ ఫైర్ అయ్యాయి. విచిత్రంగా దాని మీద ఎలాంటి ట్రోలింగ్స్ రాకుండా, హైలైట్ అవ్వకుండా తమిళ తంబీలు జాగ్రత్త పడ్డారు.
ఒకవేళ ఇదే తరహా ప్రసంగం మన స్టార్లు చేస్తే మాత్రం సభ్యత లేదు, పెద్ద మనుషులు ఇలాగే మాట్లాడతారా అంటూ ఆన్ లైన్ కోర్టులో తీర్పులు ఇచ్చేస్తారు. తప్పు ఎవరు మాట్లాడినా అది తప్పే అవుతుంది. అందరినీ ఒకేరకంగా చూడాలి. అంతే తప్ప కింగ్ ఖాన్ కాబట్టి ఏమి అనకూడాదని చెప్పడం సిల్లీనే. షారుఖ్ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోవచ్చు. కానీ మాటల రూపంలో అది నిర్వచించిన అర్థం మాత్రం ఇంకోలా ఉంది. ఈవెంట్ తాలూకు అఫీషియల్ వీడియో ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి వైరల్ కాలేదు కానీ వేడుకకు వెళ్లిన వాళ్ళు షూట్ చేసిన వీడియోలో ఇదంతా ఉంది.
This post was last modified on September 1, 2023 11:19 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…