అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ తన పుట్టినరోజు సందర్భంగా కింగ్ నాగార్జున తన కొత్త సినిమా నా సామిరంగాని కేవలం పోస్టర్ తో సరిపెట్టకుండా ఏకంగా టీజర్ తో ప్రకటించేశారు. గత కొన్ని నెలలుగా దర్శకుడి విషయంలో ఏర్పడ్డ సందిగ్దతకు తెరవేస్తూ విజయ్ బిన్నీని లాక్ చేశారు. ఇది కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ మొత్తానికి అన్ని పుకార్లకు ప్రచారాలకు చరమగీతం పాడేశారు. రెండు నిమిషాలు సాగే చిన్న ఎలివేషన్ ఎపిసోడ్ తో దీన్ని డిజైన్ చేయడం విశేషం. గత కొంత కాలంగా కేవలం స్టయిలిష్ హీరోయిజంకి కట్టుబడ్డ నాగార్జున మళ్ళీ ఊర మాస్ అవతారంలోకి వచ్చేశారు.
కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు కానీ హీరో పాత్ర తాలూకు క్యారెక్టరైజేషన్ ని రివీల్ చేశారు. ఓ యాభై బలిసిన రౌడీలు ఓ కొట్లో సారా తాగుతూ ఒకణ్ణి చంపడానికి సిద్దమవుతూ ఉంటారు. వాళ్ళు వేటాడేది మేకనుకుంటారు కానీ నిజానికా పులి లోపల వాళ్ళ మధ్యే మొహం మీద కర్చీఫ్ వేసుకుని ఇదంతా వింటోందని వాళ్లకు తెలియదు. తెలిసిన క్షణమే ఒళ్ళు జలదరిస్తుంది. ఒక్కొక్కడుగా ఆ పాక గోడలను బద్దలు కొట్టుకుంటూ బయటికి వస్తాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇస్తాడు రంగా ఉరఫ్ నాగార్జున. లుంగీ, బీడీ, మాసిన గెడ్డంతో పండక్కు వస్తున్నానని చెప్పి సంక్రాంతి హింట్ కూడా ఇచ్చేశాడు.
నాగ్ ని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అచ్చం అలాగే ప్రెజెంట్ చేశాడు దర్శకుడు విజయ్ బిన్నీ. బ్యాక్ గ్రౌండ్ లో ఎంఎం కీరవాణి సంగీతం బాగా ఎలివేట్ చేసింది. డైరెక్టర్ మారినా దీనికి కథ సంభాషణలు సమకూరుస్తున్నది మాత్రం బెజవాడ ప్రసన్న కుమారే. కాకపోతే ఇది పోరంజు మరియం జోస్ కి తెలుగు రూపకమా లేక కొత్త కథా అనేది తేలాలంటే కొంత వెయిట్ చేయాలి. బంగార్రాజులోనూ నాగార్జున మాస్ చేశారు కానీ దానికి క్లాస్ టచ్ ఉంటుంది. నా సామిరంగాని మాత్రం పూర్తిగా ఊర నాటుగా డిజైన్ చేశారు. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్న స్పెషల్ గిఫ్ట్ గట్టిగానే ఇచ్చారు
This post was last modified on August 29, 2023 10:49 am
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…