సినీ పరిశ్రమలో టైమింగ్, సక్సెస్ అనేది చాలా కీలకమైన విషయం. ఎప్పుడు ఎలాంటి సినిమా చేశారు.. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంది అన్నదాన్ని బట్టే కెరీర్లు డిసైడువుతాయి. కొన్నిసార్లు ఒక హీరోయిన్ యావరేజ్‌గా ఉన్నా, పెద్దగా నటన రాకపోయినా.. తొలి సినిమా సూపర్ హిట్ అయితే.. ఆ తర్వాత కూడా కొన్ని విజయాలు దక్కితే ఆమె మీద లక్కీ గర్ల్ అని ముద్ర పడిపోతుంది. అవకాశాలు వరుస కట్టేస్తాయి. స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేస్తుంది.
అదే సమయంలో కొందరు హీరోయిన్లకు అందం, అభినయం రెండూ ఉన్నా.. సక్సెస్ లేకపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోతారు. వాళ్ల సినిమాలు తేడా కొట్టినపుడు కనుమరుగైపోతారు. చాలా కొద్ది మంది మాత్రమే ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటారు. ‘ఏజెంట్’ సినిమాతో ఈ ఏడాదే టాలీవుడ్లోకి అడుగు పెట్టిన సాక్షి వైద్యకు స్టార్ హీరోయిన్ కాదగ్గ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
‘ఏజెంట్’ అంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ… అందులో తన అందచందాలు ఆకట్టుకున్నాయి. టాప్ హీరోయిన్ కాగల ఫీచర్స్ ఆమెలో ఉన్నాయి. నటన పరంగా కూడా ఓకే అనిపించింది. కానీ తొలి చిత్రం డిజాస్టర్ కావడంతో సాక్షికి నిరాశ తప్పలేదు. ఐతే ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా ఆమెకు రెండు పేరున్న సినిమాల్లో ఛాన్సులిచ్చారు. అందులో ఒకటి.. గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య పర్ఫెక్ట్ జోడీ అనిపించిది. వరుణ్ కటౌట్‌ను ఆమె మ్యాచ్ చేసింది. కానీ ఏం లాభం? సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. వీకెండ్లోనే ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది.
మరోసారి ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది సాక్షి. వరుసగా రెండు పెద్ద డిజాస్టర్లు అంటే.. ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది. ఐతే ఈ సినిమా కంటే ముందే ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా హరీష్ శంకర్ డైరెక్టర్ కావడంతో సాక్షి కూడా ధీమాగానే ఉండుంటుంది. పవన్‌తో అతడి సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. అలాగే హీరోయిన్ని బాగా చూపిస్తాడు. కాబట్టి ఈ చిత్రంతో ఆమె బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూద్దాం.
This post was last modified on August 27, 2023 4:24 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…