‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ సినిమా సత్తా ఏమిటనేది మరోసారి తెలిసింది. చూడ్డానికి సగటు ఫ్యామిలీ సినిమాలే అనిపించినా కానీ అవి సృష్టించే కలక్షన్ల కుంభవృష్టితో ఇప్పుడు అందరు హీరోలు త్రివిక్రమ్ కోసం క్యూ కడుతున్నారు. తారక్‍తో త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఖరారయినా కానీ అతను ‘ఆర్.ఆర్.ఆర్’తో ఇరుక్కుపోయి వున్నాడు కనుక త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో మొదలు కాదు. దీంతో త్రివిక్రమ్‍తో సినిమా చేయడానికి పలువురు అగ్ర హీరోలు ప్రయత్నిస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఎన్టీఆర్‍తో కలిపి మొత్తం నలుగురు సూపర్‍స్టార్లు త్రివిక్రమ్‍తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారట. ఒకవేళ ‘ఆర్.ఆర్.ఆర్.’ నుంచి ఎన్టీఆర్ త్వరగా బయటకు రాని పక్షంలో త్రివిక్రమ్ ఈలోగా మరో సినిమా చేస్తాడని గట్టిగా వినిపిస్తోంది.
తన ప్రాణ మిత్రుడు పవన్‍కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ కోసం సిద్ధంగా వున్న ఆ నలుగురు హీరోల్లో వున్నాడట. అయితే తన సినిమాను వాయిదా వేసి మరో సినిమా చేయరాదని ఎన్టీఆర్ కూడా గట్టిగా ఒత్తిడి చేస్తున్నాడట. కానీ అతడి కోసమని ఏడాది పాటు త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడు ఖాళీగా వుండడం కుదరదుగా.
This post was last modified on August 20, 2020 12:14 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…