ఉప్పెన రూపంలో డెబ్యూ సినిమాకే జాతీయ అవార్డు వచ్చేలా చేసిన బుచ్చిబాబు ఆనందం మాములుగా లేదు. ఇది వస్తుందని చిరంజీవి, గురువు సుకుమార్ లాంటి వాళ్ళు చెప్పినా వచ్చే క్షణం వరకు నమ్మశక్యంగా లేని ఈ విలక్షణ దర్శకుడు త్వరలో రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ లో సరికొత్త మెగా పవర్ స్టార్ ని ఆవిష్కరిస్తాడని ముందు నుంచి ఈ ప్రాజెక్టు గురించి లీకులున్నాయి. దానికి తోడు చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ మూవీ, గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమా తర్వాత చేస్తున్న క్రేజీ కాంబో ఇది.
సహజంగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్న బుచ్చిబాబు 2024 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈలోగా శంకర్ గేమ్ చేంజర్ ని పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆర్సి 16 కోసం చరణ్ పూర్తిగా కొత్త మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉప్పెనకు వచ్చిన గుర్తింపుకు బుచ్చిబాబు మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఒకపక్క తన మీద అంచనాలు, మరోవైపు చరణ్ ని హ్యాండిల్ చేస్తున్న ఒత్తిడి ఈ రెండు బ్యాలన్స్ చేసుకోవడం అంత సులభంగా ఉండదు. పైగా భారీ బడ్జెట్ ని చేతిలో పెట్టినప్పుడు.
ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడున్న జనరేషన్ దర్శకుల్లో ఎవరికీ దక్కని ఓ గొప్ప ఆనందం అతనికి దొరికింది. అవార్డు వచ్చింది దర్శకుడిగా కాకపోయినా తీసిన ఘనత తనకే చెందుతుంది కాబట్టి ఏ కోణంలోనూ దీన్ని తక్కువ చేసి చూడలేం. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్న బుచ్చిబాబుతో చరణ్ తో బలంగా ప్రూవ్ చేసుకోవడం కీలకం. వైష్ణవ్ తేజ్ అంటే కొత్త కుర్రాడు కాబట్టి అతని మీద ఏం చేసినా, ఎలా చేయించుకున్నా చెల్లిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. చాలా సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుంది. దానికి సిద్ధపడేలా అన్ని అస్త్రాలను బయటికి తీసి సంధించాల్సిందే.
This post was last modified on August 25, 2023 11:10 am
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…