సినీ పరిశ్రమలో, బయట రాజకీయాల్లో స్నేహాలు, శత్రుత్వాలు శాశ్వతం కాదనేది మనం సాధారణంగా వినే నానుడి. కానీ కొందరి బంధాలు మాత్రం దీనికి అతీతంగా ఉంటాయి. ఉదాహరణకు నాగిరెడ్డి-చక్రపాణి, బాపు-రమణ జంటలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఆధునిక జీవితం లో మెకానికల్ లైఫ్ కు అలవాటు పడిపోయాక ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ అల్లు అర్జున్-సుకుమార్ లు మాత్రం దీనికి భిన్నంగా సాగుతున్నారు. తనకు ఆర్య రూపంలో ఒక రిస్కీ లవ్ స్టోరీని నమ్మి అవకాశం ఇచ్చిన బన్నీ అంటే సుక్కుకి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం. అది ఎన్నోసార్లు బయటపడింది.
దానికి కొనసాగింపుగా చేసిన ఆర్య 2 ఫలితం నిరాశపరిచినా ఆ ప్రభావం వీళిద్దరి మీద ఎంత మాత్రం పడలేదు. ఒక పెద్ద స్టార్ హీరో వద్దని చెప్పిన పుష్పని బన్నీ నమ్మాడు. అందులోనూ అల వైకుంఠపురములో లాంటి స్టయిలిష్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంత ఊర మాస్ క్యారెక్టర్ లో తనను చూస్తారా లేదా అనే సందేహం పెట్టుకోలేదు. జస్ట్ సుకుమార్ ని నమ్మాడు. జుత్తు పెంచి, ఒళ్ళు మార్చి సంవత్సరాలు త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. అదే ఇప్పుడు ఎందరికో కలగా మిగిలిపోయిన జాతీయ అవార్డు దాకా తీసుకెళ్లింది. పుష్ప 2 ది రూల్ మీద వందల కోట్ల పెట్టుబడులు వెల్లువలా పారేలా చేసింది.
అఫ్ స్క్రీన్ కూడా బన్నీ సుక్కులు ఇంత బాండింగ్ తో ఉండటం సెట్లలో దగ్గరి నుంచి చూసినవాళ్లకు అలవాటే. పుష్ప 2 స్క్రిప్ట్ విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నా, దాని వల్ల తన విలువైన కాలం ఖర్చవుతున్నా బన్నీ భయపడలేదు. బెస్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో మొత్తం సుకుమార్ కే వదిలేశాడు. అందుకే ఎలాంటి ఒత్తిడిని తీసుకోకుండా క్రేజీ బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నా కించిత్ కూడా తొణక్కుండా నెమ్మదిగా తమ పని చేసుకుంటున్నారు. ఏది ఏమైనా తనకు డెబ్యూ ఇచ్చిన హీరోకు అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో జీవితాంతం గుర్తుపెట్టుకుని కానుక ఇచ్చాడు సుకుమార్.
This post was last modified on August 25, 2023 11:07 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…