లోక నాయకుడు కమల్ హాసన్ కేవలం హీరోయిజం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించి, ఇతరులకు ఛాలెంజ్ అనిపించే కథలను ఎంచుకుని మరీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఆయనతో తెలుగు ప్రేక్షకులకున్న అనుబంధం పెద్దదే. స్వాతిముత్యం, సాగరసంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం, ఇది కథ కాదు, సొమ్మొకడిది సోకోకొకడిది లాంటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ఎన్నో చేశారు. 80 దశకం నుంచి ఆయన ఏ భాషలో నటించినా దాని డబ్బింగ్ వెర్షన్ మన ఆడియన్స్ కి అందేలా కమల్ జాగ్రత్త తీసుకునేవారు.
కానీ ఒక్క క్లాసిక్ మాత్రం ఇరవై మూడేళ్ల తర్వాత కూడా అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే హే రామ్. 2000 సంవత్సరంలో రిలీజైన ఈ మాస్టర్ పీస్ ఆ టైంలో ఎన్నో వివాదాలను మోసుకొచ్చింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా షారుఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చేసిన మూవీ ఇదొక్కటే. ఇండో పాక్ విభజన అనంతర పరిణామాలు, దారుణాలు, మహాత్మాగాంధీ హత్య వెనుక నేపథ్యం లాంటి ఎన్నో సున్నితమైన అంశాలను కమల్ తన స్వీయ దర్శకత్వంలో ఆవిష్కరించారు. మూడు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇళయరాజా సంగీతం గొప్ప దన్నుగా నిలిచింది.
ఇలాంటి హే రామ్ తమిళ వెర్షన్ ని కొన్నేళ్ల క్రితం ప్రత్యేకంగా రీ మాస్టర్ చేయించి అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేశారు. ఇటీవలే యూట్యూబ్ లో అందరూ చూడాలనే ఉద్దేశంతో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఛానల్ లో ఉచితంగా అందుబాటులో ఉంచారు. తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న హే రామ్ తెలుగులో మాత్రం వెలుగు చూడలేదు. సెన్సార్ ఇతరత్రా కారణాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో థియేట్రికల్ రిలీజ్ అప్పట్లో కమల్ చేయలేకపోయారు. అలా అది పూర్తిగా మరుగున పడిపోయింది. ఇప్పటికైనా మాకు అర్థమయేలా అనువాదం ఇవ్వమని కమల్ ఫాన్స్ కోరుతున్నారు.
This post was last modified on August 23, 2023 1:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…