సినిమాలకు సంబంధించి రిలీజ్ ప్లానింగ్ అనేది చాలా కీలకంగా మారిపోయిన రోజులు ఇవి. ‘జైలర్’ సినిమా ఇప్పుడు కాకుండా వేరే సమయంలో వస్తే ఇంత బాగా ఆడేది కాదంటే అతిశయోక్తి కాదు. సౌత్ ఇండియా అంతటా సరైన పోటీ లేని సమయంలో రిలీజైన ఆ చిత్రం ఇండిపెండెన్స్ డే వరకు సాగిన లాంగ్ వీకెండ్‌ను బాగా ఉపయోగించుకుని భారీ విజయాన్నందుకుంది. సినిమాలో ఉన్న కంటెంట్‌ను మించి ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది.
టైమింగ్ బాగా కలిసొచ్చి ఇలా కొన్ని సినిమాలు అద్భుతాలు చేస్తే.. అది కుదరక తేడా కొట్టిన మంచి సినిమాలు కూడా ఉంటాయి. నిజానికి గత వారాంతంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఖాళీ అయిపోయింది. ‘భోళా శంకర్’ రన్ తొలి వారంలోనే ముగిసిపోవడంతో.. ‘జైలర్’యే మొత్తం వసూళ్లను లాగేసుకుంది. ప్రేమ్ కుమార్, మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి చిన్నా చితకా సినిమాలేవో వచ్చాయి కానీ.. అవి పెద్దగా ప్రభావం చూపలేదు.
ఐతే గత వారాన్ని ఖాళీగా వదిలేసి ఈ వీకెండ్ మీద పడిపోతున్నాయి కొత్త సినిమాలు. అయితే అనావృష్టి లేకుంటే అతివృష్టి అన్నట్లే ఉంది పరిస్థితి.ఈ వారం తెలుగులో ‘గాండీవధారి అర్జున’తో పాటు ‘బెదురు లంక 2012’ కూడా రిలీజవుతున్నాయి. వీటికి తోడు అనువాద చిత్రాలు ‘కింగ్ ఆఫ్ కోతా’, ‘బాయ్స్ హాస్టల్’ కూడా రిలీజవుతున్నాయి.
ఈ నాలుగు చిత్రాలూ వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కానీ నాలుగు సినిమాలకు ఒకేసారి థియేటర్లు సర్దుబాటు చేయడం ఇబ్బందే. దీనికి తోడు ప్రేక్షకులు కూుడా ఒకేవారం ఇన్ని సినిమాలను తీసుకోలేరు. టాక్‌ను బట్టి ఒకటో రెండో సినిమాలు చూస్తారు. వీటిలో ఒకట్రెండు సినిమాలు ముందు వారంలో వస్తే ప్రయోజనం ఉండేది. ముఖ్యంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కార్తికేయ.. ‘బెదురులంక’ను వారం ప్రిపోన్ చేసుకుని ఉంటే ప్లస్ అయ్యేది.
This post was last modified on August 21, 2023 6:30 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…