Movie News

స్క్రీన్లు చింపే అత్యుత్సాహం ఎవరికి లాభం

ఎప్పుడో ఆడేసి ఆన్ లైన్ లో ఫ్రీగా దొరికే సినిమాలను మరోసారి థియేటర్ లో అనుభూతి చెందాలనుకున్నప్పుడు మన ఉత్సాహం ఇంకొకరికి నష్టం కలిగించేలా ఉండకూడదు. ఇవాళ రిలీజైన యోగిని ప్రదర్శిస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల రాజ్ టాకీస్ లో ఫ్యాన్స్ స్క్రీన్ ని రెండు చోట్ల చింపేయడంతో షో అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఆ ఊరి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇకపై ఏ హీరో రీ రిలీజులు ప్రదర్శించబోమని నిమిషాల వ్యవధిలో ప్రకటించేయడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఆనందంతో ఈలలు వేయాలి కానీ ఇలా శృతి మించి ప్రవర్తించడం ముమ్మాటికీ తప్పే.

ఇది మొదటిసారి కాదు. గతంలో విజయవాడ థియేటర్ లోనూ ఇలాంటి సంఘటన జరిగితే సుమారు అయిదు లక్షల దాకా నష్టం వాటిల్లింది. ఆ సినిమా వేసినందుకు వచ్చిన కలెక్షన్ కూడా అంత లేదు. దీంతో పాత సినిమాలంటే చాలు యాజమాన్యాలు భయపడే పరిస్థితి వచ్చింది. కొత్త రిలీజుల్లో అధిక శాతం కనీస స్థాయిలో జనాన్ని రప్పించలేకపోవడంతో కనీసం వీటితో అయినా మెయింటనెన్స్, సిబ్బంది జీతాలు, అద్దెలు తదితర ఖర్చులు గిట్టుబాటు అవుతాయనే ఉద్దేశంతో షోలు వేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. తీరా చూస్తే కొందరి వ్యవహార శైలి తీరని డ్యామేజ్ చేస్తోంది.

ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. విపరీతంగా పెరిగిపోతున్న రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. నెలకు అయిదారు వచ్చే పరిస్థితి నెలకొనడంతో యూత్ వీటిని చూసి ఎంజాయ్ చేసి ఫ్రెష్ గా విడుదలైనవాటిని లైట్ తీసుకుంటున్నారు. దీని వల్ల ఎంతలేదన్నా దెబ్బ పడుతుంది. అయితే వీటిని నియంత్రించే వ్యవస్థ కానీ మార్గం కానీ లేదు. థర్డ్ పార్టీలు ప్రవేశించి ఈ వ్యవహారాలను నిర్మాతల నుంచి తమ చేతుల్లోకి తీసుకున్నాక డిజాస్టర్లకు సైతం ఫ్యాన్స్ ఎగబడి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అంత ఈజీ అయితే కాదు. 

This post was last modified on August 18, 2023 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హృతిక్ చేస్తోంది చాలా పెద్ద రిస్కు

నిన్న క్రిష్ 4 ప్రకటన వచ్చింది. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం బడ్జెట్…

8 minutes ago

లోకేశ్ స్పీచ్.. క్లెమోర్ మైన్లు, కామెడీ పీసులు, గుండె పోట్లు

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. టీడీపీ…

38 minutes ago

నాగవంశీకి అవసరం పడని సింపతీ కార్డ్

ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…

2 hours ago

వైసీపీలో.. చాలా మందే ఉన్నార‌ట‌.. !

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నపై ఇప్ప‌టికి మూడు కేసులు న‌మో ద‌య్యాయి.…

2 hours ago

చిరు – రావిపూడి కోసం బాలీవుడ్ భామలు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…

2 hours ago

ఆ ‘సంచలనం’ పుట్టి నేటికి 43 ఏళ్లు

తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…

3 hours ago