గత ఏడాది ‘కార్తికేయ-2’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ కావడంతో యువ కథానాయకుడు నిఖిల్ రేంజే మారిపోయింది. అతడితో కొంచెం పెద్ద బడ్జెట్లలో సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు. ‘స్పై’ ఆ కోవలోని సినిమానే. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అయినా సరే.. నిఖిల్‌కు డిమాండ్ ఏమీ తగ్గిపోలేదు. ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో ‘ది ఇండియా హౌస్’ అనే పెద్ద సినిమా చేస్తున్నాడతను.
ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. తాజాగా ‘స్వయంభు’ సెట్స్ మీదికి వెళ్లింది. ఈ చిత్రం శుక్రవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. దీంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. సినిమా మొదలైన సందర్భంగా ఒక ఎగ్జైటింగ్ పోస్టర్‌తో చిత్ర బృందం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచింది. అందులో గుర్రం మీద యోధుడి అవతారంలో కనిపిస్తున్నారు. పోస్టర్ డిజైన్ చూస్తే మాత్రం ‘మగధీర’ లాంటి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు.. శ్రీకర్, భువన్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బడ్జెట్ దాదాపు రూ.30 కోట్లని సమాచారం. భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. అతను తమిళంలో కొన్ని సినిమాలకు రచయితగా పని చేశాడు. చోళుల కాలం నాటి ఒక యోధుడి కథను అతను నిఖిల్ కోసం రెడీ చేశాడు.
ఐతే చోళులు అంటే ‘పొన్నియన్ సెల్వన్’యే అందరికీ గుర్తుకు వస్తుంది కాబట్టి ఆ ప్రస్తావన లేకుండా ఒక కల్పిత కథగా తెరపై దీన్ని ప్రెజెంట్ చేయబోతున్నారట. స్క్రిప్టు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. మనోజ్ పరమహంస, రవి బస్రూర్ (కేజీఎఫ్ ఫేమ్) లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేయనున్నారు. బింబిసార రచయిత వాసుదేవ్ మునెప్పగారి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాడు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. ‘స్వయంభు’తో నిఖిల్ రేంజే మారిపోయేలా ఉంది.
This post was last modified on August 18, 2023 3:06 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…