సెప్టెంబర్ 28 ఎంతో దూరం లేదు. సరిగ్గా ఇంకో నలభై రోజులు గడిస్తే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ యాక్షన్ గ్రాండియర్ థియేటర్లలో అడుగు పెడుతోంది. ప్రస్తుతానికి ప్రమోషన్లు ఇంకా వేగవంతం చేయకపోవడం పట్ల అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నా హోంబాలే ఫిలిమ్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ డే అండ్ నైట్ షిఫ్ట్స్ లో ట్రైలర్ పనులతో పాటు ఆర్టిస్టుల డబ్బింగ్ ని పూర్తి చేయిస్తున్నారు. మరోవైపు టికెట్ రేట్ల పంచాయితీలు, పెంపు కోసం అప్లికేషన్లు ఇవన్నీ చాలా అడ్వాన్స్ గా సిద్ధం చేసుకుని సదరు ప్రభుత్వాలకు నేరుగా విన్నపాలు అందజేసేలా ముందస్తు ప్లానింగ్ జరుగుతోంది.
మరో గుడ్ న్యూస్ ఏంటంటే సలార్ ఐమాక్స్ వెర్షన్ సిద్ధం చేస్తున్నారు. ఈ తెరమీద చూస్తే ఆ అనుభూతి వేరే లెవెల్ లో ఉంటుంది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, లక్నో, ముంబై, అహ్మదాబాద్, పూణే, కోల్కతా, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో అధికారిక ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. కానీ దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో లేవు. హైదరాబాద్ ప్రసాద్ పిసిఎక్స్, సూళ్లూరుపేట వి ఎపిక్ తెరలు చాలా పెద్దవే అయినప్పటికీ వాటికి ఐమాక్స్ ప్రొజెక్షన్ లేదు. క్వాలిటీ విషయంలో ఎంత పోటీ ఇచ్చినా అనుభూతిపరంగా కొంత దిగువే ఉంటాయి. అందుకే మూవీ లవర్స్ లోటుగా ఫీలవుతుంటారు.
సలార్ ని నెవెర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు పైన చెప్పిన ఏదో ఒక నగరానికి వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఐమాక్స్ మనదగ్గర రాకపోవడానికి కారణం లేకపోలేదు. టికెట్ ధరల విషయంలో ఏపీ తెలంగాణలో క్యాపింగ్ పద్దతి అమలులో ఉంది. గరిష్టంగా రేట్ ఎంత ఉండాలనేది గవర్నమెంట్ నిర్దేశించే ప్రకారం ఉండాలి. పక్క స్టేజి లో ఉన్న బెంగళూరులో జైలర్ రిక్లైనర్ సీటుని 2400 రూపాయలకు అమ్మితే హైదరాబాద్ లో 350 దాటలేదు. అందుకే ఐమాక్స్ సెటప్ ని పెట్టుకోవడానికి కార్పొరేట్ సంస్థలు సైతం వెనుకాడుతున్నాయి. ఈ కోరిక ఎప్పటికి తీరేనో.
This post was last modified on August 18, 2023 1:42 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…