నానితో మూడు చిత్రాల్లో నటించిన నివేదా థామస్ ఇంతకుముందు ఎన్టీఆర్‍తో ‘జై లవకుశ’లో నటించింది కానీ అగ్ర హీరోల సరసన వరుసగా నటించే ఛాన్స్ దక్కలేదు. ఇప్పటికీ మిడ్ రేంజ్ సినిమాలే చేస్తోన్న నివేద త్వరలో పవన్ ‘వకీల్ సాబ్’లో ఒక ఎమోషనల్ ప్లస్ కాంటెంపరరీ వుమన్ క్యారెక్టర్‍లో కనిపించనుంది. నివేద స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయినా కానీ నటిగా అందరి మన్ననలు అందుకుంది. అందుకే ఆమె ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడింది.
అశ్విన్ త్వరలో ప్రభాస్‍తో తెరకెక్కించనున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో నివేద ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోందట. మెయిన్ హీరోయిన్‍గా దీపిక పదుకోన్ ఆల్రెడీ ఖరారయిన సంగతి తెలిసిందే. మరో ముఖ్య భూమిక నివేద పోషిస్తుందని సమాచారం. ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని అనౌన్స్ చేసినా కానీ నాగ్ అశ్విన్‍తో ప్రాజెక్ట్ అయితే ‘రాధే శ్యామ్’ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లిపోతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ డెవలప్‍మెంట్స్ గురించి ప్రభాస్, అశ్విన్ నిత్యం చర్చించుకుంటూనే వున్నారు. అశ్విన్‍కి తాను చేయబోతున్న ‘ఆదిపురుష్’ డీటెయిల్స్ కూడా ప్రభాస్ చెప్పాడని అశ్విన్ వేసిన ట్వీట్ చూస్తేనే అర్థమైపోతోంది.
This post was last modified on August 19, 2020 12:08 am
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…