పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేస్తున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది ‘ఓజీ’ పైనే అని చెప్పాలి. పవర్ స్టార్‌కు పెద్ద ఫ్యాన్ అయిన సుజీత్.. తన అభిమాన కథానాయకుడిని ఒక రేంజిలో చూపిస్తాడనే అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. ‘ఓజీ’ ఫస్ట్ గ్లింప్స్ గురించి కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా దాన్ని రిలీజ్ చేయబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ రోజు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్టర్ ద్వారా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్లో డీటైలింగ్ చూశాక సినిమాపై పవన్ అభిమానుల్లో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. సినిమాలో హీరో ఎలివేషన్లు ఒక రేంజిలో ఉంటాయనే సంకేతాలను ఈ పోస్టర్ ఇచ్చింది. ఇప్పటిదాకా ‘ఓజీ’ షూటింగ్ చాలా వరకు ముంబయిలోనే సాగింది. ఈ సినిమా కథ కూడా ముంబయి బ్యాక్‌డ్రాప్‌లోనే నడుస్తుంది.
ప్రి లుక్ పోస్టర్‌లో కూడా ఇదే హింట్ ఇచ్చారు. ముంబయిలో ఒక పెద్ద భవంతి ముందు అర్ధరాత్రి వేళ కొంతమంది గూండాలను మట్టుబెట్టి తన గ్యాంగ్‌తో కలిసి ముందుకు సాగుతున్న హీరోను బ్యాక్ లుక్‌లో చూపించారిందులో. ఈ సీన్ గురించి డీటైలింగ్ ఇస్తూ.. లొకేషన్: చర్చ్ గేట్, సౌత్ బొంబాయి, టైం: 2.18 ఏఎం, రెయిన్ ఫాల్ డెన్సిటీ: 24 ఎంఎం, బ్లడ్ ఫ్లో డెన్సిటీ: 32 ఎంఎం, వెపన్ యూస్డ్: సాడ్ ఆఫ్ డబుల్ బ్యారెల్డ్ షాట్ గన్.. అని పేర్కొన్నారు.
ఇందులో వర్షపు ధారను మించి రక్తపు ధార పెద్దది అంటూ ఇచ్చిన హింట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హీరో ఎలివేషన్‌కు ఇదొక ఇండికేషన్ అనడంలో సందేహం లేదు. చిన్న పోస్టర్‌తోనే ఇంత ఎలివేషన్ ఇచ్చిన సుజీత్.. ఇక సినిమాలో ఇంకెంత ఎలివేషన్ ఇస్తాడో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇంతకీ టీజర్లో సుజీత్ ఏం చూపిస్తాడన్నది ఆసక్తికరం.
This post was last modified on August 10, 2023 1:52 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…