ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మేటి కథానాయకుల్లో ఒకడిగా నిలిచే సత్తా ఉన్న వాడు విక్రమ్. సేతు, సామి, పితామగన్, అపరిచితుడు.. హీరోగా కెరీర్ ఆరంభంలో తన ఫిల్మోగ్రఫీ చూసి వావ్ అనుకోని వారు లేరు. ఓవైపు ‘సామి’ సినిమాలో అదిరిపోయే రేంజిలో మాస్, హీరోయిజాన్ని పండించినా.. మరోవైపు ‘పితామగన్’లో డీగ్లామరస్ రోల్‌లో పెర్ఫామెన్స్‌తో ఇరగదీసినా అతడికే చెల్లింది.
కానీ ఒక దశ దాటాక అతను గాడి తప్పాడు. ప్రయోగాలు చేసి చేసి చేతులు కాల్చుకున్నాడు. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించడం అనే పిచ్చిలో పడిపోయి కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా అతను సరైన హిట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం ఉండట్లేదు. చివరగా ‘కోబ్రా’తో పలకరించిన అతడికి చేదు అనుభవం తప్పలేదు.
ఇప్పుడు విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’. ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ రూపొందిస్తున్న చిత్రమిది. వీరి కాంబినేషన్ అనగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు. దీనికి తోడు విక్రమ్ షాకింగ్ లుక్ చూసి అందరికీ దిమ్మదిరిగిపోయింది. ఇది కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలా కనిపించింది. మేకింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెంచాయి.
ఐతే విక్రమ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ నిర్మాతలు నమ్మి పెద్ద బడ్జెట్లో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. కానీ భారీ లొకేషన్లు, సెట్టింగ్స్‌తో ముడిపడ్డ ఈ పీరియడ్ మూవీకి బడ్జెట్ హద్దులు దాటిపోయిందట. రెమ్యూనరేషన్లు, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ కేవలం ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే రూ.100 కోెట్లు దాటిపోయిందట. ఓవరాల్ బడ్జెట్ దాదాపు రూ.200 కోట్ల దాకా అవుతుందని సమాచారం.
విక్రమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడి మీద ఇంత ఖర్చు పెట్టడం రిస్కే. కానీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు సాహసం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే విక్రమ్ కొత్త లుక్‌ను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘తంగలాన్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.
This post was last modified on August 4, 2023 7:37 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…