దసరాతో ఈ ఏడాది సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని మంచి ఊపు మీదున్నాడు. హయ్ నాన్న పేరుకి ఫ్యామిలీ ఎంటర్ టైనరే అయినప్పటికీ బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. డిసెంబర్ క్రిస్మస్ కానుకగా వెంకటేష్, నితిన్ లతో పోటీ పడేందుకు రెడీ అవుతోంది. వి తర్వాత కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్న నానికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగా రజనీకాంత్ నటించబోయే ఆయన 170వ సినిమాలో ఓ కీలక పాత్ర ఆఫర్ చేసినట్టు చెన్నై అప్డేట్. జై భీంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న టిజె జ్ఞానవేల్ దీనికి దర్శకుడు.
మరో విశేషం కూడా ఉంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు. కథ తాలూకు డీటెయిల్స్ ఇంకా ఏదీ బయటికి రాలేదు కానీ దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఓ ఎన్ కౌంటర్ ఆధారంగా చాలా సీరియస్ ఇష్యూతో తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. జై భీంలాగే ఇందులోనూ సున్నితమైన అంశాలు ఉంటాయట. అయితే నాని ఓకే చెప్పింది లేనిది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. రజని 170 బృందం ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉంది. జైలర్ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో రెండు వారాలు పట్టొచ్చు.
ఇది నిజమైతే నానికి ఒక అరుదైన ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇండియన్ సినిమా దిగ్గజాలు రజని, అమితాబ్ లతో ఒకేసారి స్క్రీన్ పంచుకోవడం నిజంగా అదృష్టమే. వాళ్లిద్దరూ కలిసి ఒకప్పుడు నటించారు కానీ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది . న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇది వీలైనంత త్వరగా మొదలుకావాలని కోరుకుంటున్నారు. సోలో హీరోగా నాని చేసిన మల్టీస్టారర్లు పెద్దగా లేవు. నాగార్జునతో చేసిన దేవదాస్ మాత్రమే చెప్పుకోదగ్గది. కానీ ఇప్పుడీ రజనీకాంత్ 170 మాత్రం అన్నింటిని మించి లార్జర్ దాన్ లైఫ్ అవుతుంది. వాస్తవం అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on August 4, 2023 1:19 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…