స్టార్ హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తితే.. కొన్ని టెంప్లేట్ సమాధానాలు ఇస్తారు. నా పెళ్లికి ఇంకా టైం ఉంది.. ఇప్పుడు ఆ ఆలోచనే లేదు.. సమయం వచ్చినపుడు చెబుతా.. అంటూ సమాధానం దాటవేస్తారు. కన్నడ అమ్మాయి అయినా.. ఆ భాషలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్నాకు కూడా తాజాగా పెళ్లి గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
అందుకామె బదులిస్తూ.. ఒక నటుడితో తనకు ఎప్పుడో పెళ్లయిపోయిందని చెప్పి అందరికీ పెద్ద షాకిచ్చింది. ఆమె చెప్పిన ఆ మాటకు ఆ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సైతం షాకింగ్ లుక్ ఇచ్చాడు. కానీ తర్వాత అసలు విషయం బయటపెట్టింది రష్మిక.
‘‘నాకు నరుటోతో ఎప్పుడో పెళ్లయిపోయింది. అతనే నా మనసులో ఉన్నాడు’’ అని రష్మిక పేర్కొంది. ఇంతకీ ఈ నరుటో ఎవరయ్యా అంటే జపనీస్ టీవీ సిరీస్ ‘నరుటో’లో ప్రధాన పాత్రధారి. ఆ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆ క్యారెక్టర్‌తో వాళ్లందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతుంటారు. రష్మిక కూడా ఆ పాత్రకు వీరాభిమాని అన్నమాట.
ఇప్పటికే పలు సందర్భాల్లో నరుటో క్యారెక్టర్‌పై తన ఇష్టాన్ని చాటుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అనేక పోస్టులు పెట్టారు. అవకాశం వస్తే ఈ సిరీస్ కొత్త సీజన్లో తాను నరుటో ప్రేయసి హినాటాగా కనిపించడానికి కూడా రెడీ అని.. అందుకోసం హెయిర్ స్టైల్ కూడా మార్చుకుంటానని రష్మిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నరుటోతో ప్రేమలో పడ్డట్లు, పెళ్లి చేసుకున్నట్లు ఆమె కామెంట్ చేసింది. ప్రస్తుతం రష్మిక.. తెలుగులో ‘పుష్ప-2’.. తమిళంలో ‘రెయిన్ బో’, హిందీలో ‘యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on October 8, 2023 4:33 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…