వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా ఉంది బాక్సాఫీస్ పరిస్థితి. పెద్ద హీరోలు బరిలో ఉంటే రిస్క్ ఎందుకని చిన్న సినిమాలు దూరంగా ఉంటాయి. ఎవరూ లేరని ఒక శుక్రవారం మీద కన్నేస్తే మూకుమ్మడిగా చోటా ప్రొడ్యూసర్లందరూ అదే డేట్ మీద పడతారు. రేపు ఆగస్ట్ 4 పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉంది. బ్రో ఫలితం తేలిపోవడంతో థియేటర్లు మళ్ళీ పల్చబడుతున్నాయి. బేబీ మెరుగ్గానే ఉన్నప్పటికీ మూడు వారాలు గడిచిపోయాయి కాబట్టి వీకెండ్స్ తప్ప రాబట్టుకోవడానికి ఇంకేం లేదు. ఇప్పటికే ఎనభై కోట్ల గ్రాస్ ని దాటేసి తలలు పండిన ట్రేడ్ పండితులను విస్మయపరిచింది.
ఇక రేపటి రిలీజుల కౌంట్ చూస్తే భారీగా ఉంది. కృష్ణగాడు అంటే ఒక రేంజ్, మిస్టేక్, ప్రియమైన ప్రియ, రాజుగారి కోడిపలావు, దిల్ సే, రెంట్ లు బరిలో దిగుతున్నాయి. ఇవి కాకుండా డబ్బింగ్ చిత్రాలు మెగ్ 2 ది ట్రెంచ్, అర్జున్ దాస్ బ్లడ్ అండ్ చాకోలెట్, సుదీప్ హెబ్బులి, ధోని నిర్మించిన ఎల్జిఎం(LGM), విజయ్ ఆంటోనీ విక్రమ్ రాథోడ్ లు ఒకేసారి తలపడుతున్నాయి. వీటిలో దేనికీ కనీస అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. పబ్లిక్ టాక్ లో ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప కలెక్షన్ల మీద ఆశలు పెట్టుకోవడానికి లేదు. హాలీవుడ్ మూవీకి సైతం స్పందన అంతంతమాత్రంగా ఉంది.
విచిత్రంగా పాత రీ రిలీజులు బిజినెస్ మెన్, సూర్య సన్ అఫ్ కృష్ణన్ లకు ఆన్ లైన్ బుకింగ్స్ వేగంగా ఉండటం ట్విస్టు. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదో గుంటూరు కారమే విడుదలవుతోందనే రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. మెయిన్ సెంటర్స్ లో ఈ రెండు సినిమాల ఉదయం ఆటల టికెట్లు ఆల్రెడీ అమ్ముడుపోయాయి. మిగిలిన షోలకు కూడా డిమాండ్ బాగుంది. ఏదో ట్రెండ్ ని ఫాలో అవ్వడమే కానీ ఈ పాత సినిమాలు కొత్త రిలీజులను దెబ్బ కొడుతున్నాయన్న కామెంట్లకు బలం చేకూర్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కంటెంట్లు వీక్ గా ఉన్నప్పుడు ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు.
This post was last modified on August 3, 2023 1:28 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…