పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ఆరేడేళ్ల నుంచే నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.. గత రెండేళ్లలో పెద్ద రేంజికి ఎదిగింది. అంతకుముందంతా చిన్న సినిమాలే నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా తీసే రేంజికి ఎదిగారు. గత ఏడాది పీపుల్ మీడియా నుంచి కార్తికేయ-2, ధమాకా రూపంలో రెండు వంద కోట్ల సినిమాలు వచ్చాయి.
దీంతో ఆ సంస్థ పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలతో పెద్ద సినిమాలు లైన్లో పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు విశ్వ ప్రసాద్. ఐతే ఇలా రేంజ్ పెరిగాక ‘పీపుల్ మీడియా’ నుంచి వచ్చే సినిమాల క్వాలిటీ పడిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. గత ఏడాది ఈ సంస్థకు గొప్పగా కలిసి రాగా.. 2023లో మాత్రం వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ ప్రేక్షకులకు టార్చర్ చూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించలేదు. దాని తర్వాత ‘రామబాణం’ అనే మాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది పీపుల్ మీడియా. ఆ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా మీద మంచి బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు పెద్ద నష్టం తప్పలేదు. ఈ మధ్య పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూషన్లో అడుగు పెట్టగా అందులోనూ చేదు అనుభవాలు తప్పలేదు. తమిళ అనువాద చిత్రం ‘టక్కర్’ను రిలీజ్ చేస్తే వాషౌట్ అయిపోయింది.
ప్రభాస్‌తో సొంతంగా సినిమాను నిర్మిస్తున్న పీపుల్ మీడియా.. అతడి ‘ఆదిపురుష్’ను భారీ రేటుకు కొని రిలీజ్ చేస్తే అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ కూడా పీపుల్ మీడియాకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ సినిమా ఊపు వీకెండ్ వరకే పరిమితం అయింది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిన ‘బ్రో’ ఇక పుంజుకునేలా కనిపించడం లేదు. బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు. ఇలా వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న పీపుల్ మీడియా.. ఇక ముందు అయినా కొంచెం జాగ్రత్త పడటం మంచిది.
This post was last modified on August 2, 2023 3:41 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…