‘బ్రో’ సినిమాలో మిగతా విషయాల కంటే ఇందులో ఏపీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబును పోలిన శ్యాంబాబు పాత్ర మీద చాలా చర్చ జరిగింది గత కొన్ని రోజుల్లో. ఒకప్పుడు వైసీపీలోనే ఉండి.. ఆ తర్వాత బయటికి వచ్చిన కమెడియన్ పృథ్వీ ఈ పాత్రను పోషించాడు. శ్యాంబాబు అనే పేరు పెట్టుకుని.. సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబును పోలిన డ్రెస్సింగ్‌తో పృథ్వీ వేసిన స్టెప్పులు చూసిన ఎవ్వరికైనా ఆయన గుర్తుకు రాకుండా ఉండరు.
తన మీద చేసిన ఈ స్పూఫ్, పవన్ పేల్చిన డైలాగులు చూసి ముందు అంబటి రాంబాబు సరదాగానే స్పందించారు. కానీ తర్వాత ఆయన స్వరం మారిపోయింది. నిన్న ఈ విషయం మీదే ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ను దారుణంగా టార్గెట్ చేశారు. పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడి.. ఆయన మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి కొన్ని వెకిలి టైటిల్ కార్డ్స్ కూడా మీడియా ముందు ప్రదర్శించారు. అంతే కాక తనను ఇలా టార్గెట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని త్రివిక్రమ్ పేరు చెప్పి మరీ ఇండస్ట్రీ మొత్తానికి వార్నింగ్ ఇచ్చారు అంబటి.
ఐతే కొన్ని నిమిషాలు కనిపించే పాత్ర పెట్టి చిన్న స్పూఫ్ చేసి.. సింపుల్ కౌంటర్లు వేసినందుకే అంబటి రాంబాబు ఇంత తీవ్రంగా స్పందించడం చర్చనీయాంశం అవుతోంది. మరి రామ్ గోపాల్ వర్మ వైసీపీ మౌత్ పీస్ లాగా మారిపోయి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘పవర్ స్టార్’ లాంటి సినిమాలు తీసినపుడు టీడీపీ, జనసేన నేతలు ఎలా స్పందించాలన్నది ఇప్పుడు ప్రశ్న. ‘బ్రో’లో అంబటి పాత్రను కొంచెం సరదాగానే చూపించారు. ఆ పాత్ర మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఏమీ చేయలేదు పవన్. కానీ పైన పేర్కొన్న సినిమాల్లో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఎంత దారుణంగా చిత్రీకరించారో.. ఎన్ని వెకిలి సన్నివేశాలు పెట్టారో అందరికీ తెలుసు.
చాలా చీప్‌గా అనిపించే సినిమాలివి. అంతటితో ఆగకుండా ఈ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’తో పాటు మరో సినిమా ఏదో చేస్తున్నాడు వర్మ. అందులో ఇంకా దారుణంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయబోతున్నారన్నది స్పష్టం. మరి శ్యాంబాబు పాత్ర విషయంలో ఆయనతో పాటు తీవ్రంగా స్పందిస్తున్న వైసీపీ మద్దతుదారులంతా వర్మ తీసిన, తీస్తున్న సినిమాల గురించి ఏమంటారు? వీటిపై బాబు, లోకేష్, పవన్ ఎంత తీవ్రంగా రియాక్టవ్వాలి? ఎలాంటి వార్నింగ్‌లు ఇవ్వాలి?.
This post was last modified on August 2, 2023 1:29 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…