మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఒక పెద్ద సినిమా సందడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన ‘బ్రో’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ గత సినిమాలతో పోలిస్తే దీనికి హైప్ కొంచెం తక్కువ ఉన్న మాట వాస్తవం. వరుసగా మూడో రీమేక్.. పైగా ఒరిజినల్ మాస్ అంశాలకు అవకాశమే లేని సినిమా కావడం సగటు ప్రేక్షకుల్లోనే కాక పవన్ అభిమానుల్లోనూ ఈ చిత్రంపై తక్కువ అంచనాలు పెట్టుకునేలా చేశాయి.
దీనికి తోడు ప్రోమోలు కూడా అంత ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. కానీ పవన్ సినిమా అంటే.. రిలీజ్ ముందు రోజు వరకు పరిస్థితి ఎలా ఉన్నా సరే.. విడుదల రోజు మొత్తం కథ మారిపోతుంది. థియేటర్లు నిండిపోతాయి. ‘బ్రో’ విషయంలోనూ అదే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక విడుదలైన ప్రతి చోటా ‘బ్రో’ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడిపోయాయి. సినిమాకు టాక్ అంత గొప్పగా లేదు. అలా అని తీసి పడేసేలానూ లేదు.
పవన్ నటించిన గత రెండు రీమేక్‌ల్లాగే ఇది కూడా ఒరిజినల్‌తో పోలిస్తే కొత్త కలర్లో కనిపించింది. పవర్ స్టార్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అనేక ఆకర్షణలు జోడించారు. పవన్ మాస్‌ను మెప్పించేలా ఫైట్లు చేయలేదన్న మాటే కానీ.. అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం తగ్గలేదు. పవన్ తనను తానే ఇందులో ఇమిటేట్ చేస్తూ అభిమానులను అలరించాడు. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, జల్సా.. ఇలా పవన్ హిట్ సినిమాల్లోని పలు పాటలకు సంబంధించిన మ్యూజిక్ ప్లే అవడం.. పవన్ వాటికి స్టెప్పులేస్తూ, ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఎంటర్టైన్ చేయడం సినిమాకు పెద్ద ఆకర్షణ.
పవన్ ఇంట్రో సీన్.. ఆ తర్వాత వచ్చే 15 నిమిషాల ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో పవన్ కనిపించినంతసేపూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలిగాడు. కానీ మిగతా విషయాలే నిరాశపరిచాయి. ఒరిజినల్లో ఉన్న ఎమోషనల్ డెప్త్ ఇందులో మిస్సయింది. కథాకథనాలు ఆశించినంత స్థాయిలో లేవు. కానీ సినిమాపై ముందు నుంచి మరీ అంచనాలు లేవు కాబట్టి మరీ నిరాశ చెందకపోవచ్చు. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో శాటిస్ఫై అయిపోతారు. మిగతా వాళ్లు సినిమాను ఎలా తీసుకుంటారన్నదాన్ని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on July 28, 2023 2:36 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…