శ్రీలీల నో చెప్పడం మంచిదే

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా టాప్ డిమాండ్ లో ఉన్న శ్రీలీల చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయని ఆమె మేనేజర్ ని అడిగినా ఠక్కున సమాధానం చెప్పలేడేమో. క్రేజీ ప్రాజెక్టులన్నింటిలో భాగమైనప్పుడు వాటిని కౌంట్ చేయడానికి టైం పడుతుంది మరి. ప్రస్తుతం రోజుకు రెండు మూడు కాల్ షీట్ల చొప్పున పని చేయాల్సిన ఒత్తిడిలో ఉన్న శ్రీలీలకు పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అమ్మడు సున్నితంగా నో చెప్పిందని వినికిడి. కెరీర్ పీక్స్ ఉన్న దశలో పాట ఎంత బాగున్నా అలాంటివి చేయడం రిస్కని ఫీలవుతోందట.

భవిష్యత్తులో బన్నీతో ఎలాగూ ఫుల్ లెన్త్ రోల్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు తొందరపడాలనేది తన వెర్షన్ కావొచ్చు. పూజా హెగ్డే ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే రంగస్థలంలో జిగేలు రాణి చేసింది. అది ఛార్ట్ బస్టర్ కొట్టింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. పైగా శ్రీలీల ఎక్కువ స్కిన్ షోకి ఒప్పుకోదు. దుస్తుల్లో గ్లామర్ చూపిస్తుంది కానీ ఒంటి ద్వారా కాదు. అలాంటప్పుడు సుకుమార్ టేకింగ్ కి అంతగా ఫిట్ అవ్వకపోవచ్చు. ఆ మధ్య ఆహా ఓటిటి ప్రకటన కోసం అల్లు అర్జున్, శ్రీలీలలు త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించారు. జోడి ఫ్రెష్ గా అనిపించింది. ఫ్యాన్స్ ఆలా చూడాలనే కోరుకుంటారు

మొత్తానికి శ్రీలీల చేసింది మంచి పనేనని చెప్పాలి. ఈ టైంలో స్పెషల్ సాంగ్స్ కరెక్ట్ కాదు. ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి మహేష్ బాబు గుంటూరు కారం పెద్ద ప్రమోషన్ గా నిలవబోతోంది. కమిటైన సినిమాలు అన్నింటిలోకి ఇదే పెద్దది, క్రేజీది. బ్లాక్ బస్టర్ పడితే మాత్రం ఆల్రెడీ ఉన్న రేంజ్ అమాంతం డబుల్ అవుతుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి టాలీవుడ్ టాప్ లీగ్ తో నటించేందుకు ఎదురు చూస్తున్న శ్రీలీల కోరికను త్రివిక్రమే నెరవేర్చాలి. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆలస్యమవ్వొచ్చు.