Movie News

పవన్ మీదికి తమిళులను రెచ్చగొడుతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సుదీర్ఘ ప్రసంగమే చేశారు. అందులో అనేక అంశాలపై మాట్లాడారు. అందరినీ ఆశ్చర్యపరిచింది.. చర్చనీయాంశంగా మారింది మాత్రం.. తమిళ సినీ పరిశ్రమ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే. తమిళ సినిమాల్లో తమిళు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని.. తమిళనాడు పరిధిలోనే షూటింగ్ చేయాలని సినీ పరిశ్రమలో ఈ మధ్య కొన్ని షరతుల మీద పవన్ మాట్లాడాడు.

ఇలా ఒక పరిధి పెట్టుకుంటే ఏ పరిశ్రమా ఎదగలేదని.. తెలుగు పరిశ్రమ అందరినీ అక్కున చేర్చుకుంది కాబట్టే ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగిందని.. ఇలాగే విశాల దృక్పథంతో ఆలోచిస్తే కోలీవుడ్ నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు వస్తాయని పవన్ పేర్కొన్నాడు. తమిళుడే అయిన దర్శకుడు సముద్రఖనిని పక్కన పెట్టుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొందరు తమిళ పీఆర్వోలు ఈ వ్యాఖ్యల గురించి పాజిటివ్‌గానే పోస్టులు పెట్టారు.

కానీ ఆత్మాభిమానం కొంచెం ఎక్కువగా ఉండే తమిళులు కొందరికి ఈ వ్యాఖ్యలు నచ్చట్లేదు. దీని మీద ఆల్రెడీ కొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వారూ లేకపోలేదు. ఐతే పవన్ రాజకీయ శత్రువులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళులది సంకుచిత మనస్తత్వం అని పవన్ వ్యాఖ్యానించాడని.. ఆ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడాడని అంటూ తమిళులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. ఏ చిన్న అవకాశం వచ్చినా అన్‌పాపులర్ చేయాలని చూసేవాళ్లు మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తమిళులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనసైనికులు, పవన్ అభిమానులు.. వీరిని దీటుగానే ఎదుర్కొంటున్నారు. పవన్ వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

This post was last modified on July 26, 2023 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

3 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

4 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

బ‌డ్జెట్ రెడీ.. ఆ రెండు ప‌థ‌కాల‌కే నిధులు ..!

ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను…

5 hours ago

తండేల్ పాసవ్వాల్సిన 4 పరీక్షలు

ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…

5 hours ago

లైలా… ఇంత స్పైసీ ఉంటే ఎలా

విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…

5 hours ago