గజిని నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సూర్యకు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పటి మార్కెట్ స్థాయి తగ్గినప్పటికీ సరైన కంటెంట్ పడాలే కానీ బౌన్స్ బ్యాక్ అయ్యేంత స్టేచర్ పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలో కంగువా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా దీన్ని రూపొందిస్తున్నారు. బడ్జెట్ ఎంతో పైకి చెప్పడం లేదు కానీ రెండు వందల కోట్లకు పైమాటేనని చెన్నై మీడియా టాక్. హీరో పుట్టినరోజు సందర్భంగా నిన్న అర్ధరాత్రి ట్రైలర్ లాంటి టీజర్ లాంచ్ చేశారు
కథను రివీల్ చేసే అవకాశం ఇవ్వకుండా తెలివిగా కట్ చేశారు. శతాబ్దాల వెనుక అరాచకం రాజ్యమేలుతున్న చోట, శరణు కోరిన వాళ్ళను ఆదుకోవడం కోసం అరుదైన వంశం నుంచి వచ్చిన కంగువా అన్యాయం చేసిన వాళ్ళ తలలు నరికే బాధ్యతను తీసుకుంటాడు. కుశలమా అంటూనే క్రూరత్వాన్ని, స్నేహాన్ని కళ్ళతో పలికించి వణికిస్తాడు. విజువల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. రెండు నిమిషాలకు పైగానే ఉన్న వీడియోలో సూర్యని కేవలం ఒక షాట్, చిన్న మాటకే పరిమితం చేయడం ద్వారా ట్రైలర్ కోసం కావలిసిన హైప్ ని అలాగే నిలబెట్టారు. ఇది గ్లిమ్ప్స్ మాత్రమే.
దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం థీమ్ ని గొప్పగా ఎలివేట్ చేసింది. ఇతర క్యాస్టింగ్ ఎవరినీ రివీల్ చేయలేదు. వచ్చే ఏడాది వేసవి రిలీజ్ ప్లాన్ చేసుకున్న కంగువాని మొత్తం పది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ కూడా మల్టీ ఆడియో ఆప్షన్లు పెట్టారు. త్రీడి వెర్షన్ సిద్ధం చేయబోతున్నారు. ప్రస్తుతానికి దిశా పటాని ఉన్నట్టు తప్ప ఇతర తారాగణం గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా తమ బ్యానర్ లోనే కాదు కోలీవుడ్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో కంగువా తీస్తున్నారు. మొత్తానికి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూసిన కంగువా ఎలా ఉంటాడో క్లారిటీ వచ్చేసింది
This post was last modified on July 23, 2023 10:35 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…