భీమ్లా నాయక్ వచ్చి ఏడాది దాటేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బ్రో కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వినోదయ సితం రీమేక్ కావడంతో పాటు టీమ్ మరీ అగ్రెసివ్ గా ప్రమోషన్లు చేయకపోవడంతో పవర్ స్టార్ రేంజ్ లో హంగామా లేదు. ఇదంతా ఎలా ఉన్నా అసలు కంటెంట్ సర్ప్రైజ్ చేస్తుందని దర్శకుడు సముతిరఖని, నిర్మాత టిజి విశ్వప్రసాద్ నొక్కి వక్కాణిస్తూ వచ్చారు. మావయ్యతో మొదటిసారి నటించడం పట్ల సాయి ధరమ్ తేజ్ ఎగ్జైట్ మెంట్ తో కనిపిస్తున్నాడు. ఇందాక వైజాగ్ జగదాంబ, హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లలో ఒకేసారి ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది.
కార్పొరేట్ కంపెనీలో మధ్య తరగతి ఉద్యోగి మార్కండేయ(సాయి తేజ్). ఎప్పుడూ టైం లేదని తెగ ఫీలయ్యే తత్వం. ఆఖరికి లవర్(కేతిక శర్మ)తో లవ్ చేస్తూ ముద్దు పెట్టాలన్నా ప్లాన్ చేసుకునే రకం. ఒక యాక్సిడెంట్ ఇతని జీవితాన్ని మారుస్తుంది. మనిషి రూపంలో టైం(పవన్ కళ్యాణ్) వస్తాడు. ఇతనితో దోస్తీ చేసి జీవితంలో అసలు మజా చూపించడం మొదలుపెడతాడు. రకరకాల వేషాల్లో పక్కనే ఉంటూ ఒక ఫ్రెండ్ గా, గైడ్ గా మారిపోతాడు. అయితే చచ్చి బ్రతికిన మార్కండేయకు బ్రో వచ్చి వెళ్ళిపోయాక జీవితం ఏమయ్యిందనేది స్క్రీన్ మీద చూసే దాకా ఆగాలి మరి.
ఇప్పటిదాకా ఫ్యాన్స్ కొంత డ్రై ఫీలింగ్ తో ఉన్నా అదంతా పూర్తిగా పోగొట్టేలా ట్రైలర్ కట్ చేశారు. పవన్ స్వాగ్, ఎనర్జీ అభిమానులు సెలెబ్రేట్ చేసుకునేలా ఉంది. త్రివిక్రమ్ డైలాగులు, డిఫరెంట్ గెటప్పులు అన్నీ ఓ రేంజ్ లో పేలాయి. తమన్ ఎప్పటిలాగే బీజీఎమ్ పరంగా తన డ్యూటీ కరెక్ట్ గానే చేశాడు. తక్కువ టైంలో తీసినా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ కనిపిస్తోంది. జూలై 28 విడుదల అతి దగ్గరగా ఉన్న నేపథ్యంలో దానికి సరిపడా హైప్ ని పెంచేలా బ్రో టీమ్ చేసిన కృషి ఫలించేలా ఉంది. పవర్ స్టార్- సుప్రీమ్ హీరో కాంబినేషన్ ని ఎంజాయ్ చేయొచ్చనే భరోసా ఇచ్చారు. ఇక అంచనాలను నిలబెట్టుకోవడమే మిగిలింది.
This post was last modified on July 22, 2023 6:42 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…