ఒక ఇండియన్ సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా నిన్న శాన్ డియాగో వేదికగా జరిగిన కామ్ కాన్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కె టైటిల్ ని కల్కి 2898 AD గా రివీల్ చేయడం సోషల్ మీడియాలో సునామి సృష్టించింది. దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలవడం కోసం ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ తదితరులంతా హాజరయ్యారు. అయితే హీరోయిన్ దీపికా పదుకునే మాత్రం కనిపించలేదు. ముందైతే వస్తుందనే ప్రచారం జరిగింది కానీ రాలేదు. అయితే దీనికి కారణం షూటింగులు కాదు. తప్పించుకోలేని అడ్డంకి ఒకటి వచ్చి పడటంతో యాబ్సెంట్ అయ్యింది.
యుఎస్ లో మొన్న మే నెల నుంచి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (SAG) ఆధ్వర్యంలో నడిచే అమెరికన్ ఫెడరేషన్ అఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్(AFTRA) పాటు రైటర్స్ గిల్డ్ అఫ్ అమెరికా(WGA) నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాయి. హాలీవుడ్ కార్మిక చట్టాలు తమ హక్కులని కాలరాసే విధంగా ఉన్నాయని నిరసన తెలుపుతూ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయి. ఈ సంఘంలో దీపీకా పదుకునే సభ్యురాలు. వాళ్ళు పెట్టిన షరతుల ప్రకారం అమెరికాలో జరిగే ఎలాంటి ప్రోగ్రామ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనరాదు. అందుకే ఇష్టం లేకపోయినా కల్కి భామ దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఈ సమస్య లేకపోతే టీమ్ తో పాటు తను కూడా అక్కడ దర్శనమిచ్చేది. ప్రభాస్ తర్వాత టీజర్ లో రివీల్ చేసింది తనను మాత్రమే. అలాంటి అరుదయిన సందర్భంలో భాగమయ్యే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది. తన టాలీవుడ్ డెబ్యూ కూడా కల్కినే. అయితే అమితాబ్ బచ్చన్ గైర్హాజరికి కారణం మాత్రం ఆరోగ్య పరిస్థితులే అని తెలిసింది. ఒక అరుదైన సందర్భానికి వేదికగా నిలిచిన కామ్ కాన్ ని కల్కి టీమ్ బాగా సెలెబ్రేట్ చేసుకుంది. అక్కడ వచ్చిన స్పందన ఈ ప్యాన్ ఇండియా మూవీని అంతర్జాతీయ స్థాయిలో అటెన్షన్ తీసుకొచ్చింది. మున్ముందు ఇంకా భారీగా ప్లాన్ చేయబోతున్నారు.
This post was last modified on July 21, 2023 9:04 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…