బూతు సినిమాల్ని పక్కన పెడితే.. మామూలు సినిమాలో పేరున్న భారతీయ కథానాయిక సగం సినిమాలో నగ్నంగా నటించడం అంటే మాటలు కాదు. తమిళ హీరోయిన్ అమలా పాల్ ఈ సాహసమే చేసింది. నగ్నంగా అంటే నగ్నంగా కనిపించినట్లు కాదు కానీ.. ఒంటి మీద నూలుపోగు లేని భావన కలిగించేలాగే నటించింది ‘ఆమె’ సినిమాలో అమలాపాల్.
తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అమలా పాల్ చాలానే కష్టపడింది. సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురైతే తన పారితోషకం కూడా వెనక్కిచ్చేసింది. ఐతే ఆమె కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కలేదు. ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ బోల్డ్ అటెంప్ట్‌గా ఈ సినిమాకు కోలీవుడ్లో ప్రత్యేక స్థానం దక్కింది.
ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌కు వెళ్లబోతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రభాస్ మూవీ సాహోలో కథానాయికగా నటించిన శ్రద్ధా కపూర్ హిందీ ‘ఆమె’లో లీడ్ రోల్ చేయనుందట. బాలీవుడ్ వాళ్లు సౌత్ కథలు తీసుకుని.. వాటికి తమదైన టచ్ ఇచ్చి సరికొత్తగా తయారు చేయడం మామూలే. ఈ కథ కూడా అలాగే హిందీలోకి వెళ్లనుంది.
ఐతే రీమేక్‌కు కూడా ఒరిజినల్ తీసిన రత్నకుమారే దర్శకత్వం వహిస్తాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. శ్రద్ధా కపూర్ స్టారే కానీ.. గ్లామర్ విషయంలో పరిమితులు పాటిస్తుంటుంది. అలాంటమ్మాయి ఈ బోల్డ్ ఫిలింలో ఎలా కనిపిస్తుంది.. ఎలా మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరం. బాలీవుడ్లో అయినా ఈ సాహసోపేత కథకు మంచి ఫలితం వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 15, 2020 11:52 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…