పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ’బ్రో‘ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందు ప్రకటించినట్లే జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తమిళ హిట్ ’వినోదియ సిత్తం‘కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు.
ఒరిజినల్లో ఆయన చేసిన దేవుడి పాత్రనే ఇక్కడ పవన్ చేశాడు. ఐతే సినిమాలో పవన్ చేసింది అతిథి పాత్రలా ఉంటుందనే అంచనాతో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కు కూడా పవన్ మరీ ఎక్కువ రోజులేమీ వెళ్లలేదు. కేవలం మూడు వారాల్లో అంతా అయిపోయింది. దీంతో ఇది గెస్ట్ క్యారెక్టర్ అని బలంగా నమ్ముతున్నారు.
కానీ సినిమాలో 80-90 శాతం రన్ టైంలో పవన్ ఉంటాడని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. తొలి 15 నిమిషాలు మాత్రమే పవన్ లేకుండా కథ నడుస్తుందని తేజు వెల్లడించాడు. అప్పటిదాకా తన మీదే కథ నడుస్తుందని.. ఆ తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని.. అక్కడి నుంచి ముగింపు వరకు పవన్ పాత్ర కొనసాగుతుందని.. ఎప్పుడూ తన వెంటే ఉండే పాత్ర ఆయనదని తేజు తెలిపాడు. సినిమాలో మొత్తంగా గంటా 50 నిమిషాల రన్ టైంలో పవన్ ఉంటాడని కూడా తేజు వెల్లడించాడు.
సినిమాలో తన మీద ఒక డ్యూయెట్ ఉంటే.. పవన్, తన కాంబినేషన్లో ఇంకో పాట ఉంటుందని.. మిగతా రెండు పాటలు మాంటేజ్ తరహాలో ఉంటాయని తేజు వెల్లడించాడు. పవన్ చేసింది దేవుడి పాత్రే అయినా.. గోపాల గోపాల తరహాలో సీరియస్ గా ఉండదని.. దాన్ని పూర్తి ఎంటర్టైనింగ్ గా.. అభిమానులకు నచ్చేలా అల్లరిగా త్రివిక్రమ్, సముద్రఖని తీర్చిదిద్దారని.. తనతో కలిసి చేయడం వల్ల పవన్ కూడా చాలా సరదాగా ఈ పాత్రను చేసుకుపోయాడని.. తమ మధ్య బాండే సినిమాకు మేజర్ హైలైట్ అని తేజు తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates