Movie News

ప్రాజెక్ట్ K – సూపర్ హీరో ప్రభాస్

వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో ఇండియాలోనే కాస్ట్లీ ఫిలింగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ రెండు గంటలు ఆలస్యంగా రివీల్ చేశారు. అయితే సింపుల్ గా ప్రభాస్ ఫేస్ ని రివీల్ చేయకుండా సినిమాలో గెటప్ ని కంప్లీట్ గా చూపించడం విశేషం. ఒళ్ళంతా మెటల్ డ్రెస్ తో అవెంజర్స్ సూపర్ హీరోలా డార్లింగ్ కి ఇచ్చిన బిల్డప్ ఓ రేంజ్ లో ఉంది. హెయిర్ స్టైల్ కూడా వెరైటీగా పొడవాటి జుత్తుతో కొత్త స్టైలింగ్ ఇచ్చారు.

చూసేందుకు బాగానే ఉంది కానీ కొంత సహజత్వం లోపించినట్టు అనిపిస్తోంది. అది విజువల్ ఎఫెక్ట్ వల్ల జరిగిందా లేక రేపు టీజర్ రిలీజ్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇలా చేయాల్సి వచ్చిందా అనేది వేచి చూడాలి. ఈ ఒక్క మైనస్ ని పక్కన పెడితే ప్రాజెక్ట్ కెలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న దుష్ఠశక్తులను అంతమొందించే లక్ష్యంతో పోరాడే వీరుడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూడొచ్చు. ప్రీ లుక్ పోస్టర్స్ లో గతంలో చూపించిన ఆ రెండో చేయి ఎవరిదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె  అనే ప్రమోషన్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కె అంటే కల్కి, కాలచక్రం, కురుక్షేత్రం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి చెక్ మరికొద్దిగంటల్లో పడబోతోంది, శాన్ డైగో వేదిక మీద ప్రభాస్, రానా, దీపికా పదుకునే, కమల్ హాసన్ లతో పాటు దర్శక నిర్మాతలు టైటిల్, కాన్సెప్ట్ ని ప్రపంచానికే పరిచయం చేయబోతున్నారు. అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె ఇకపై ప్రమోషన్లకు సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. నాగ అశ్విన్ అద్భుతం చేయబోతున్నాడని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

This post was last modified on July 19, 2023 4:16 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

11 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

12 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago