ఇటీవలే అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలు.. తెలంగాణ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంగా ఘనంగా జరిగాయి. అంతకుముందు ఆంధ్రా ప్రాంతంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఐతే ఈ వేడుకలో అల్లూరి విగ్రహాన్ని రూపొందించిన తీరు పట్ల.. అలాగే అల్లూరి పూర్తి పేరు విషయంలో టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు అల్లూరి పేరు సీతారామరాజు కాదు అని ఆయన అంటున్నారు. అలాగే అల్లూరి ఆహార్యం మనం ఎప్పుడూ చూసేలాగా లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వ్యాసం రాశారు. అందులో తమ్మారెడ్డి ఏమన్నారంటే..
అల్లూరి అసలు పేరు శ్రీరామరాజు మాత్రమే. ఆయన జీవితంలో సీత అనే పాత్ర లేదు. ఐతే పడాల రామారావు అనే రచయిత ఈ సీత పాత్రను జోడించి ఒక ఫిక్షన్ కథ రాశారు. ఆ నాటకంలో అల్లూరికి పంచె కూడా కట్టారు. ఐతే శ్రీరామరాజు ఎప్పుడూ పంచె కట్టిన దాఖాలు లేవు. ఆయన పంచె కట్టినట్లు చూసిన వాళ్లెవ్వరూ చెప్పలేదు. ఆయన నిక్కరే వేసుకునే వారట. చిన్న వయసులోనే చనిపోయిన ఆయన ఎప్పడూ నిక్కరుతోనే కనిపించేవారు. ఆయన మరణించిన ఫొటోల్లో కూడా గమనిస్తే నిక్కరుతో ఉంటారు. ఎన్టీఆర్ గారు అల్లూరి మీద సినిమా తీయాలనుకున్నపుడు పంచె కట్టుకుని బాణం పట్టుకుని ఒక స్టిల్ దిగారు. అది బాగుందని కృష్ణగారు కూడా అదే గెటప్‌తో సినిమా చేశారు.
తన సినిమాకు ‘అల్లూరి సీతారామరాజు’ అని పేరు కూడా పెట్టారు. మొన్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌ను సైతం అలాంటి గెటప్‌లోనే చూపించారు. అందులోనూ తన పేరు ‘సీతారామరాజు’ అనే పెట్టారు. కానీ చరిత్రలో ఉన్నది వేరు. ఈ మధ్య అల్లూరి జయంతి ఉత్సవాలు జరిగినపుడు మనం ఇన్నాళ్లూ చూస్తున్న అవతారంలోనే ఆయన విగ్రహం పెట్టారు. పేరు కూడా ‘సీతారామరాజు’ అనే రాశారు. ప్రభుత్వాల మీద కూడా సినిమాల ప్రభావం ఉంటుంది అనడానికి ఇది రుజువు. ఆయన అసలు పేరునే ఇక్కడ రాసి.. అసలు గెటప్‌తోనే విగ్రహం పెట్టాల్సింది’’ అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
This post was last modified on July 16, 2023 5:26 pm
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…