Movie News

థియేటర్ ఓనర్ల సాధ్యం కాని డిమాండ్లు

నిన్న తమిళనాడు థియేటర్ ఓనర్ల అసోసియేషన్ సమావేశమై పలు డిమాండ్లను కోలీవుడ్ నిర్మాతల ముందుంచింది. స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లు ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో నటించాలనేది అందులో మొదటిది. కొత్త చిత్రాలు ఏవైనా సరే ఎనిమిది వారాల తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ కి ఇవ్వడం, వాటి తాలూకు యాడ్స్ నెల రోజుల తర్వాతే వచ్చేలా డిజిటల్ కంపెనీలతో మాట్లాడ్డం, తాజా రిలీజులకు 60 శాతం షేర్, ఈవెంట్లకు పర్మిషన్లు ఇవ్వడం, కరెంటు తదితర బిల్లులను వీలైనంత త్వరగా తగ్గించడంతో పాటు టికెట్ రేట్లు పెంచడం మిగిలినవి

నిజానికి ఇవన్నీ ఆచరణలో అంత సులభంగా సాధ్యమయ్యే అవకాశం లేనివే. ఎందుకంటే స్టార్ హీరోలు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేయాలనేది ప్రతిసారి వాళ్ళ చేతుల్లో ఉండదు. పరిస్థితుల ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఇక ఓటిటి గ్యాప్ కు సంబంధించిన నిబంధన పాటించాలంటే నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. గత ఏదేది టాలీవుడ్ లోనూ అలాంటి రిజల్యూషన్ తీసుకురావాలని ప్రయత్నించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాన్ని పటిష్టంగా అమలు చేయడంలో విఫలమయ్యింది. దీంతో ఎప్పటిలాగే రెండు వారాల నుంచి నెల రోజుల్లోపే ఓటిటిలో వస్తున్నాయి.

ఈసారి వీటి మీద గట్టిగా పోరాడాలని తమిళ ఎగ్జిబిటర్లు కంకణం కట్టుకున్నారు కానీ ప్రాక్టికల్ గా జరిగే పని కాదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం చేతుల్లో ఉన్న టికెట్ రేట్ల పెంపు తప్ప ఇంక దేనికి సంబంధించి ఆశలు పెట్టుకున్నా వృథానే అంటున్నారు. అక్కడ ఇప్పుడు మేల్కొన్నారు కానీ తెలుగులో ఎప్పటి నుంచో ఈ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా తర్వాత ఓటిటి మార్కెట్ విస్తృతంగా పెరిగిన తరుణంలో దానికి అనుగుణంగా నడుచుకోవడం తప్ప ప్రొడ్యూసర్లకు పెద్దగా ఆప్షన్లు ఉండటం లేదు. ఒకవేళ పైన చెప్పినవి నిజంగా చేయగలిగితే పక్క రాష్ట్రాల్లోనూ మార్పు చూడొచ్చు 

This post was last modified on July 12, 2023 11:53 am

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

17 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

49 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago