ఇండియాలో క్రికెట్ పిచ్చి లేని యూత్ తక్కువగా కనిపిస్తారు. ఫిలిం సెలబ్రెటీల్లో కూడా క్రికెట్‌ను చాలా ఇష్టపడేవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. టాలీవుడ్లో సీనియర్ హీరో క్రికెట్ అండే పడి చచ్చిపోతారని అందరికీ తెలుసు. యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ఒకప్పుడు ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో అతను మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు.
ఇక టాలీవుడ్ టెక్నీషియన్లలో క్రికెట్ పిచ్చి బాగా ఉన్నది ఎవరికి అంటే మరో మాట లేకుండా తమన్ పేరు చెప్పేయొచ్చు. సంగీతం కోసం కాకుండా అతను టైం పెట్టే ఏకైక వ్యాపకం క్రికెట్. వారంలో నాలుగైదు రోజులు అతను క్రికెట్ మ్యాచ్‌లు ఆడతాడన్న విషయం కొంతమందికే తెలుసు. క్రికెట్ మ్యాచ్‌ల కోసమే అతను చెన్నై టు హైదరాబాద్ తరచుగా విమాన ప్రయాణాలు కూడా చేస్తాడని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఇటు హైదరాబాద్‌లో, అటు చెన్నైలో తమన్ రాత్రి పూట మ్యాచ్‌లు ఆడతాడు. అక్కడా ఇక్కడా అతడికి కంపెనీ ఇచ్చే క్రికెట్ గ్యాంగ్స్ ఉన్నాయి. రాత్రి తొమ్మిది లోపు తన మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని తొమ్మిది గంటల నుంచి తాము మ్యాచ్‌లు ఆడతామని తాజాగా మీడియాను కలిసిన సందర్భంగా తమన్ తెలిపాడు.
‘తమన్ హిట్టర్స్’ పేరుతో తనకే ఒక టీం ఉందని.. అందులో తన మిత్రులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉంటారని.. తామంతా నైట్ మ్యాచ్‌లు ఆడతామని తమన్ తెలిపాడు. కొందరికి మందు కొట్టడం ఆనందాన్నిస్తే కొందరికి అమ్మాయిలతో తిరగడం సంతోషమని.. తనకు క్రికెట్ అలాంటిదే అని తమన్ వెల్లడించాడు. క్రికెట్ తనకు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందని.. తన స్ట్రెస్ మొత్తం అందులోనే పోతుందని తమన్ చెప్పాడు. తన ఫేవరెట్ క్రికెట్ ధోనీ అని.. ఆయన నిర్మించే సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా పని చేస్తానని తమన్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates