ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే చాలా పెద్ద స్థాయిలో వందల కోట్ల పెట్టుబడితో, వివిధ భాషల కంటెంట్‌తో మొదలుపెట్టాల్సి ఉంటుందని.. లోకల్ స్థాయిలో అలాంటివి మొదలుపెట్టడం సాధ్యం కాదనే అభిప్రాయంతో ఉన్న చాలామందికి అల్లు అరవింద్ షాకిచ్చారు.
‘ఆహా’ పేరుతో ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టారు. ఇది పూర్తిగా తెలుగుకే పరిమితమైన యాప్ కావడం విశేషం. మామూలుగా అయితే దీనికి ఎలాంటి స్పందన వచ్చేదో కానీ.. లాక్ డౌన్ భలేగా కలిసొచ్చి ‘ఆహా’ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.
అల్లు వారి దగ్గరున్న సినిమాలకు తోడు కొత్త చిత్రాలు, ఒరిజినల్ కంటెంట్ మరీ ఎక్కువేమీ ఇవ్వకపోయినా ఇప్పటిదాకా ‘ఆహా’ యాప్‌కు 40 లక్షల డౌన్ లోడ్లు వచ్చాయంటే విశేషమే.
ప్రమోషన్ కూడా భారీగా ఏమీ లేకుండానే.. ఉన్నంతలో ‘ఆహా’ బాగానే విజయవంతమైందన్నది స్పష్టం. ఐతే ఇకముందు ఇలా నెట్టుకు రావడం కష్టమే. ఓన్ కంటెంట్, అది కూడా క్వాలిటీతో ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి. తాము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నామంటున్నారు అరవింద్.
‘ఆహా’ మొదలయ్యాక తొలిసారిగా ఆయన ఈ యాప్ గురించి మీడియాతో మాట్లాడారు. ‘ఆహా’ కోసం చాలా షోలు సిద్ధం చేస్తున్మని.. కొన్ని చర్చల దశలో ఉన్నాయని.. ఆల్రెడీ సిద్ధమైన షోలకు తోడు ఎప్పటికప్పుడు కొత్తవి రెడీ చేస్తూనే ఉంటామని ఆయనన్నారు.
థియేటర్, ఓటీటీల్లో ఏవీ దేనికీ ప్రత్యామ్నాయం కాదని.. రెండూ సమాంతరంగా నడుస్తుంటాయని ఆయనన్నారు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని ఆయనన్నారు. థియేటర్లు, సినిమా పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో జనాలు వీకెండ్లలో మాత్రమే థియేటర్లకు వస్తారనిపిస్తోందని.. మిగతా రోజుల్లో వినోదం కోసం ఓటీటీలు, టీవీలను ఆశ్రయించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on August 14, 2020 7:13 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…