మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ తాలూకు కీలక షెడ్యూల్ కి రంగం సిద్ధమయ్యింది. కూతురు క్లింకార ఆగమనాన్ని మనసారా ఎంజాయ్ చేసిన చరణ్ హైదరాబాద్ సెట్లో కాలు పెట్టబోతున్నాడు. యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వీటి పర్యేవేక్షణతో పాటు సెకండ్ యూనిట్ కు సంబంధించిన వ్యవహారాలు హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనుకి ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాములుగా ఇదేమి పెద్ద విషయం కాకపోయినా శంకర్ లాంటి పర్ఫెక్షననిస్టులు ఈ పద్ధతి ఫాలో కారు.
కానీ ఇండియన్ 2 కోసం ఒత్తిడిలో ఉన్న శంకర్ కు వేరొకరికి తాత్కాలికంగా అయినా సరే బాధ్యతలు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే శైలేష్ కొలనుని నిర్మాత దిల్ రాజు రికమండేషన్ తోనే రంగంలోకి దించారట. వెంకటేష్ సైంధవ్ తో బిజీగా ఉన్న శైలేష్ వీలును బట్టి అవసరాన్ని బట్టి గేమ్ ఛేంజర్ లో భాగమవుతున్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యానికి గురైన ఈ సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. 2024 సంక్రాంతి,వేసవి రెండు సీజన్లు మిస్ చేసుకుంటే మళ్ళీ దసరా దాకా ఎదురు చూడాల్సి వస్తుంది.
దానికన్నా ముందే రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ 2 సమ్మర్ కన్నా ముందే రాదని నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే చెప్పేశాడు కాబట్టి అది పొంగల్ బరి నుంచి తప్పుకున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే మరో ఆ స్లాట్ లో గేమ్ ఛేంజర్ ని తీసుకురావాలన్న ఆలోచన ఉంది కానీ ఇప్పుడున్న అతి తక్కువ టైంలో పోస్ట్ ప్రొడక్షన్లు, ప్రమోషన్లు ఇవన్నీ అంత సులభంగా జరిగేవి కాదు. ఏది ఏమైనా ఇండియన్ 2 వల్ల శంకర్ ఎక్కువ దాని మీదే ఫోకస్ పెట్టడం, గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్స్ గురించి పట్టించుకోకపోవడం ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేస్తోంది
This post was last modified on July 11, 2023 3:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…