పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కొత్త పుకార్లు మొదలయ్యాయి. సినిమా ఆపేస్తున్నారని, కేవలం వారం పది రోజుల షూటింగే జరిగింది కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం షురూ చేశారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు. వారాహి యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో తక్కువ గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ రెండో విడతకు రెడీ అయ్యారు. ఈ వేడిలోనే వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరిగితే జనసేనను జనానికి మరింత దగ్గర చేయొచ్చనే ప్రణాళికలో భాగంగా ప్లాన్ చేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో షూటింగులు కొనసాగించడం కష్టం. అసలు బ్రోకే డబ్బింగ్ ఎప్పుడు చెప్పాలో టైం దొరకనంత టైట్ గా షెడ్యూల్ ఉంది. రిలీజ్ ఇంకో ఇరవై రోజులే ఉంది కాబట్టి వీలైనంత త్వరలోనే ఆ లాంఛనం పూర్తి చేస్తారు కానీ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకు బ్రేక్ తప్పదు. అది చిన్నదా లేక పెద్దదా అనేది ఇప్పటికిప్పుడు తేలదు. ఎన్నికలు ముందస్తుగా రావొచ్చనే రాజకీయ విశ్లేషకుల అంచనాలను ఆధారంగా చేసుకుని పవన్ ప్రజా క్షేత్రంలోనే ఉండటం అవసరం కనక సినిమాలకు ఎక్కువ టైం కేటాయించడం సాధ్యపడదు. అందుకే ఒకటి రెండు రద్దు చేస్తారని చెబుతున్నారు.
అయితే నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కాబట్టి ఇదంతా గాలి వార్తగానే తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు హరీష్ శంకర్ త్వరలోనే రవితేజతో కాంబో రిపీట్ చేస్తారనే వార్త పైన న్యూస్ కి మరింత బలం చేకూర్చింది. స్టోరీ ఫిక్స్ చేసిన మాట వాస్తవమే కానీ ఎప్పుడు మొదలుపెట్టాలనేది ఇద్దరూ నిర్ణయించుకోలేదు. రవితేజ తన కమిట్మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవి దాకా ఫ్రీ అయ్యే సూచనలు తక్కువే. ఆలోగా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాలనేది హరీష్ టార్గెట్. ఏ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం
This post was last modified on July 8, 2023 1:43 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…