ప్రాజెక్ట్ K స్కెచ్ వేరే లెవెల్

ఒక భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కామిక్ కాన్ లో ఎంట్రీ ఇవ్వడం ఇదే మొదటిసారనే విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ని విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది.  ఇప్పటిదాకా ఎందరో మహామహులకు సాధ్యం కాని ఈ ఫీట్ ప్రభాస్ టీమ్ వల్ల చేరుకోవడం మాములు సంతోషాన్ని ఇవ్వడం లేదు. జూలై 20న జరగబోయే ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె టీమ్ తమ టైటిల్ తో పాటు, టీజర్, ట్రైలర్ తో కూడిన ప్రత్యేకమైన ఫుటేజ్ ని ఆహ్వానితులకు ప్రదర్శించబోతున్నారు. ఒక ఇండియన్ మూవీలో ఇలాంటివి సాధ్యమా అనిపించే రేంజ్ లో విజువల్స్ ఉంటాయని టాక్.

ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునేలతో పాటు ప్రాజెక్ట్ కె బృందం మొత్తం ఇందులో భాగం కాబోతోంది. దర్శకుడు నాగ అశ్విన్  సాన్ డియెగో కామిక్ కాన్ లో చోటు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తమ ప్రయత్నాన్ని పరిచయం చేసే గొప్ప వేదికగా దీన్ని గురించి చెప్పుకొచ్చాడు. జనవరి 12 విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న ప్రాజెక్ట్ కె ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. రెండు భాగాలుగా ప్లాన్ చేశారు కాబట్టి ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది, సీక్వెల్ ని 2025 లో రిలీజ్ చేస్తారని టాక్. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఆ వేదికపైనే తెలుస్తాయి

ఆర్ఆర్ఆర్ లాగా రిలీజయ్యాక గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడం కాకుండా వైజయంతి మూవీస్ ఇప్పటి నుంచే ప్రాజెక్ట్ కెని ఇంటర్నేషనల్ కంటెంట్ గా ప్రమోట్ చేస్తోంది. దీని వల్ల ప్రపంచమంతా ఒకేసారి ఒకే హైప్ తో చూడటం వల్ల దేశం మొత్తం గర్వపడే ఓపెనింగ్స్ సాధించవచ్చనే ధీమాతో ఉంది. ఇప్పుడీ ఈవెంట్ అయ్యాక ఇక్కడా ప్రమోషన్లు పెంచబోతున్నారు. సెప్టెంబర్ 28 సలార్ రిలీజయ్యాక కొంత గ్యాప్ ఇచ్చి ప్రాజెక్ట్ కెని ఉధృతంగా జనంలోకి తీసుకెళ్ళబోతున్నారు. ప్రాజెక్ట్ కెని కేవలం ఒక సినిమాగా కాకుండా మార్వెల్, డిస్నీ ప్రమాణాలతో అందించాలనేదే నాగ అశ్విన్ ధ్యేయం