నాగశౌర్య చివరి మూణ్నాలుగు సినిమాలు తీవ్ర నిరాశకే గురి చేశాయి. అతడి కొత్త సినిమా ‘రంగబలి’కి కొన్ని రోజుల ముందు వరకు అసలేమాత్రం బజ్ లేదు. ఆ టైటిలే జనాలకు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. మేకింగ్ దశలో ఉండగా ఈ సినిమా గురించి అసలు చర్చే లేదు. అలాంటి సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.. చిత్ర బృందం వారం కిందట రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కమెడియన్ సత్యతో కలిసి నాగశౌర్య చేసిన ఈ వీడియో ఇన్‌స్టంట్ హిట్ అయింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కొందరు జర్నలిస్టులను అనుకరిస్తూ సత్య చేసిన హంగామా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ప్రోమోను చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేసి.. సోషల్ మీడియాలో దీన్నొక సెన్సేషన్‌గా మార్చింది టీం. ప్రోమో చూసి ఫుల్ వీడియో మీద చాలా అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.
ఇందులో సత్య అనుకరించిన జర్నలిస్టుల్లో ఇద్దరు ఈ వీడియో చూసి హర్టయ్యారని.. అందుకే ఫుల్ వీడియో రిలీజ్ చేయట్లేదని మధ్యలో వార్తలు వచ్చాయి. అది తెలిసి చాలామంది ప్రేక్షకులు నిరాశ చెందారు. ఫుల్ వీడియో కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. చివరికి నిన్న ఒక పార్ట్, ఈ రోజొక పార్ట్‌గా ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఐతే ప్రోమో చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఫుల్ వీడియో కిక్ ఇవ్వలేదు.
వీడియోలో హైలైట్లన్నీ ప్రోమోలోనే వెళ్లిపోయాయి తప్ప.. అంతకుమించిన మెరుపులు ఏమీ లేవిందులో. అక్కడక్కడా కొంచెం ఫన్ మినహాయిస్తే.. పేలిపోయే కామెడీ అంటూ కనిపించలేదు. ఆశించినంత క్రియేటివిటీని చిత్ర బృందం చూపించలేకపోయింది. ఎంతో ఆసక్తిగా వీడియో చూసిన ప్రేక్షకులంతా ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. కాకపోతే ప్రోమో వల్ల బాగానే ప్రయోజనం పొందిన చిత్ర బృందం ఇప్పుడొస్తున్న నెగెటివిటీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
This post was last modified on July 5, 2023 4:36 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…