కొణిదెల ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు కానీ.. అక్కడి నుంచి హీరోయిన్ అయింది మాత్రం ఒక్క కొణిదెల నిహారిక మాత్రమే. అందుకు తగ్గట్లే ఆమెకు మీడియాలో, సోషల్ మీడియాలో మంచి ప్రచారమే లభిస్తుంటుంది. సినీ రంగంలో ఆశించిన విజయం సాధించకపోయినా.. ఉన్నన్నాళ్లూ నిహారిక వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ మధ్య ఉన్నట్లుండి పెళ్లి వార్తతో ఆమె వార్తల్లోకి వచ్చింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమెకు పెళ్లి ఖాయమైంది. గురువారం వీరి నిశ్చితార్థం కూడా అయిపోయింది. కరోనా నేపథ్యంలో వీలైనంత సింపుల్‌గానే ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిక కొద్దిసేపటికే నాగబాబు కొంచెం చమత్కారం కలిపిన ఓ ఎమోషనల్ ట్వీట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
తన అల్లుడిని ‘డియర్ చై’.. అంటూ ఆత్మీయంగా సంబోధించిన ఆయన.. నిహారిక చాలా విషయాల్లో తన లాగే ఉంటుందని అందరూ అంటుంటారని.. ఆమె మీద ప్రపంచంలోని ప్రేమనంతా చూపిస్తావని ఆశిస్తున్నా అని అన్నారు. ఇక చివరగా ఓ కామెంట్‌తో నాగబాబు తన ఫన్నీ యాంగిల్ చూపించారు. ‘‘ఈ రోజు నుంచి అధికారికంగా తను నీ సమస్య’’ అని ముగించారు నాగబాబు. తోడుగా ఒక కొంటె ఎమోజీని కూడా ఆయన జోడించారు.
ముందు కొంచెం ఎమోషనల్‌గా అనిపించినా చివరికి వచ్చేసరికి సరదాగా ఉన్న ఈ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ కూడా తన తండ్రి షేర్ చేసిన నిశ్చితార్థపు ఫొటోనే షేర్ చేస్తూ.. తన బేబీ సిస్టర్‌కు నిశ్చితార్థం జరిగిందని అంటూ ‘వెల్కం టు ద ఫ్యామిలీ బావా’ అని చైతన్యకు ఆహ్వానం పలికాడు. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి డిసెంబరులో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 14, 2020 9:35 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…