స్టార్ హీరోల పిల్లలు పరిశ్రమలోకి ప్రవేశించడానికి కొంచెం ఎక్కువే టైమే తీసుకుంటారు. అది కూడా అబ్బాయిల విషయంలోనే చొరవ కనిపిస్తుంది. కమల్ హాసన్ లాంటి ఒకరిద్దరు తప్ప కూతళ్లను తెరకు పరిచయం చేసే వాళ్ళు ముఖ్యంగా దక్షిణాది పరిశ్రమలో చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ గారి తనయ మంజులని టాప్ హీరో ద్వారా బాలకృష్ణ సరసన జోడిగా లాంచ్ చేయాలనే ఆలోచన చేసినప్పుడు ఫ్యాన్స్ మూకుమ్మడిగా వద్దన్నారు. దీంతో ఆమె కొన్నేళ్ల తర్వాత షో లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుని గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండిపోయారు.
కానీ మహేష్ బాబు, నమ్రతల ప్లానింగ్ ముందు నుంచి వేరుగా ఉంది. మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న సితార ప్రతిభను అవకాశం దొరికినప్పుడంతా పబ్లిక్ కు చూపించడానికి వెనుకాడగలేదు. ఆ పాప వేసే డాన్సులతో మొదలుపెట్టి తండ్రితో కలిసి రియాలిటి షోలకు జడ్జ్ గా వెళ్లడం దాకా నిత్యం మీడియాలో ఉండేలా చూసుకున్నారు. తాజాగా ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్ ని సృష్టించింది. దీని తాలూకు ప్రకటనని న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇటీవలే దిల్ రాజు అబ్బాయి పుట్టినరోజు వేడుకలకు హాజరైన సితార నాన్నతో పాటు కలిసి కలిసి వచ్చి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారింది. అభిమానులు ఒకవైపు గౌతమ్ లాంచ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తుంటే రివర్స్ లో సితార దూసుకుపోతుండటం విశేషం. అయినా మారుతున్న కాలంలో ఎంత సినిమా సెలబ్రిటీలు అయినా సరే కూతుళ్లను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలనుకోవడం న్యాయం కాదు. స్టార్ కిడ్స్ లో అత్యధిక పారితోషికం అందుకుంటోంది సితారనేనట. చూస్తుంటే ఇంకో నాలుగైదేళ్ల తర్వాత వెండితెరపై చూసే ఛాన్స్ దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on July 4, 2023 12:21 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…