దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న విజువల్ గ్రాండియర్ హనుమాన్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఇంకో రెండు మూడు నెలల్లో వస్తుందనుకుంటే 2024 జనవరి 12 రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ వదిలారు. నిజానికి ఆదిపురుష్ కన్నా ముందే రావాలని టీమ్ ప్లాన్ చేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్స్ ఎక్కువగా ఉండటంతో వాయిదా వేస్తూ వచ్చారు. అప్ కమింగ్ హీరో తేజ సజ్జ మీద ఇంత బడ్జెట్ పెట్టడం గురించి ఇండస్ట్రీలోనే ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. పాతిక నుంచి నలభై కోట్ల మధ్యలో అయ్యిందని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా ఉండగా ఆల్రెడీ సంక్రాంతికి అదే డేట్ కి ప్రాజెక్ట్ కెని ఎప్పుడో ప్రకటించారు. ప్రభాస్ – కమల్ – అమితాబ్ కాంబోతో వస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా దీంతో తలపడటం అంత ఈజీ కాదు. అసలు థియేటర్లు దొరకడమే పెద్ద సవాల్. ఒకవేళ వైజయంతి మూవీస్ నుంచి ఖచ్చితమైన సమాచారం అందుకుని హనుమాన్ ని అనౌన్స్ చేశారానేది తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. దీన్ని కాసేపు మినహాయిస్తే మహేష్ బాబు గుంటూరు కారం జనవరి 13 టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ వేగవంతం చేసింది. కమర్షియల్ సబ్జెక్టు కాబట్టి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదు.
రవితేజ ఈగల్ ని ఆల్రెడీ లాక్ చేశారు. ఆగస్ట్ 22న ప్రారంభం కాబోయే చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణల సినిమా కూడా పండగే కావాలంటోంది. మరి ఇంత తీవ్రమైన పోటీ మధ్య హనుమాన్ ఆ స్లాట్ ని తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఆదిపురుష్ గురించి జరిగిన నెగటివ్ క్యాంపైన్ ని దృష్టిలో పెట్టుకుని అలాంటి ప్రతికూలత రాకుండా ప్రశాంత్ వర్మ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వినికిడి. అదేదో దసరాకో దీపావళికో వదిలేస్తే సరిపోయేది కానీ ఇంత టఫ్ కాంపిటీషన్ లో హనుమాన్ ని దింపడం ఎంత లేదన్నా రిస్కీ స్ట్రాటజీనే