కంటెంట్ ఉన్నప్పుడు వివాదాలెందుకు బేబీ

చిన్న సినిమాలకు పబ్లిసిటీ గిమ్మిక్కులు తప్పవు. లేదంటే జనాల అటెన్షన్ రాదు. కలర్ ఫోటో కథకుడు, నిర్మాత సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన డెబ్యూ మూవీ బేబీ జూలై 14న విడుదల కానుంది. ఇప్పటికే మ్యూజిక్ పరంగా దీనికి చాలా మంచి పేరు వచ్చింది. ఇటీవలి కాలంలో ఇంత మంచి మెలోడీస్ వినలేదని మ్యూజిక్ లవర్స్ ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. నాలుగు పాటలు ఈ మూవీ రేంజ్ కి మించి ఛార్ట్ బస్టర్ అయ్యాయి. యూత్ లో సరిపడా రిజిస్టర్ అయ్యింది. అయితే రిలీజ్ పోస్టర్ లో ఇచ్చిన స్టిల్ వివాదాస్పదంగా ఉండటం చర్చకు దారి తీసింది.

ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే దాన్ని తీసేసినప్పటికీ అప్పటికే ఇది వైరల్ అయిపోయింది. కొన్ని వందల మీమ్స్ పేజీలు, సోషల్ మీడియా హ్యాండిళ్లు దాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. వీడియో అయితే డిలీట్ చేయించవచ్చు కానీ కేవలం పోస్టర్ ని కట్టడి చేయడం కష్టం. సినిమాలో ఒక కీలకమైన పాయింట్ ని అక్కడ చెప్పాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదని సాయి రాజేష్ వివరణ ఇచ్చినప్పటికీ స్టిల్ లో ఉన్న అభ్యంతరకర విషయం ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఫ్యాన్స్ కొందరు అందులో తప్పేమి లేదని మద్దతు తెలపగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు

కంటెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి అవసరమే లేదు. బేబీ మీద సరిపడా బజ్ ఉంది. బిజినెస్ ఆఫర్లు కూడా బాగున్నాయి. యూత్ ఫుల్ మూవీస్ ఈ మధ్య పెద్దగా రాలేదు. క్యాస్టింగ్ అట్రాక్షన్ లేకపోయినా బేబీ టీమ్ అనుసరిస్తున్న పబ్లిసిటీ స్ట్రాటజీ మంచి ఫలితాలు ఇస్తోంది. ఒక పాట లాంచ్ ని రష్మిక మందన్నతో చేయించారు. మరో సాంగ్ ఇండస్ట్రీ ప్రముఖులు వచ్చి విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్ద గెస్టును తీసుకురావడంలో అనుమానం అక్కర్లేదు. అన్నీ ఇంత సానుకూలంగా ఉన్నప్పుడు పొరపాటు అయినా సరే ట్విట్టర్ జనాలు అంత సులభంగా వదిలిపెట్టరు