ఇండియన్ స్పిల్ బర్గ్ గా పిలుచుకునే దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం పెద్ద తలనెప్పిని తెచ్చి పెడుతోంది. ఇండియన్ 2 షూటింగ్ అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చినప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఒప్పుకున్నాడు. తీరా విక్రమ్ బ్లాక్ బస్టర్ అయ్యాక లైకాకి ఆశలు చిగురించి కోర్టు ద్వారా కమల్ హాసన్ మూవీని పూర్తి చేసేలా శంకర్ మీద ఒత్తిడి తీసుకు రాగలిగింది. దీంతో చరణ్ నిర్మాత దిల్ రాజు నిస్సహాయంగా తనకు ఇచ్చిన డేట్లకు షూటింగ్ ఏర్పాట్లు చేయడం తప్ప ఏమీ చేయలేకేపోయారు. దీని వల్లే రిలీజ్ డేట్ ఎప్పుడనేది తేలలేదు.
వచ్చే సంక్రాంతికి ఇండియన్ 2 వస్తుందనే అందరూ నమ్మారు. అదే జరిగితే వేసవిలో గేమ్ ఛేంజర్ చూడొచ్చని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఇది జరిగేలా లేదు. తన లేటెస్ట్ రిలీజ్ మామన్నన్ ప్రమోషన్లలో భాగంగా హీరో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఇండియన్ 2 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని సెలవిచ్చాడు. కమల్ ప్రాజెక్టులో ఈయన నిర్మాణ భాగస్వామి. పక్కా సమాచారం లేనిదే ఊరికే చెప్పడు. ఇంకో ఇరవై శాతం షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు చాలా ఉన్నాయట. అందుకే టైం పడుతుందని అన్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ జనవరిని ఆల్రెడీ మిస్ చేసుకున్న గేమ్ ఛేంజర్ ఇప్పుడు సమ్మర్ ని కూడా పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే ఒకే సీజన్ లో తన రెండు సినిమాలు విడుదల చేసేందుకు శంకర్ ఒప్పుకోడని ఆల్రెడీ టాక్ ఉంది. అదే జరిగితే 2024 దసరా లేదా దీపావళి తప్ప చరణ్ దిల్ రాజులకు మరో ఆప్షన్ ఉండదు. ఇప్పటికే విపరీతమైన జాప్యంతో అసహనంగా ఉన్న ఫ్యాన్స్ కి ఇది షాక్ ఇచ్చేదే. ఇదంతా తెలిసే అభిమానులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఎస్విసి సంస్థ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వడం మానేసింది. సో ఎలా చూసుకున్నా దీనికి లాంగ్ వెయిటింగ్ తప్పదు.
This post was last modified on June 29, 2023 10:24 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…