కేవలం నెల రోజుల్లో విడుదల పెట్టుకుని బ్రో సినిమా తాలూకు రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వకపోవడం పట్ల పవన్ అభిమానులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద నిరసన వ్యక్తం చేస్తూనే వచ్చారు. సోషల్ మీడియాలో ఆ ఎఫెక్ట్ కనిపించింది. ఎప్పుడో ఆగస్ట్ లో వచ్చే భోళా శంకర్ కి ఆల్రెడీ ఒక లిరికల్ వీడియో, టీజర్ రాగా బ్రో మాత్రం రెండు మూడు పోస్టర్లతో సరిపెట్టారు. వాళ్ళను చల్లార్చేందుకు ఇవాళ వదిలిన కొత్త లుక్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ కిక్ ఇస్తోంది. ఎప్పుడో తమ్ముడులో చూసిన ఊరమాస్ బీడీ, పంచెకట్టు లుక్కులో చూసి వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. కాస్త చల్లబడ్డారు
ఇది ఓకే కానీ అసలు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే డౌట్ రావడం సహజం. దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జనసేన వారాహి యాత్ర. పవన్ పవర్ ఫుల్ స్పీచులకు జనం నుంచి బ్రహ్మాండమైన వస్తోంది. కార్యకర్తలు, ఫాలోయర్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఇలాంటి టైంలో సినిమాల గురించి హడావిడి చేస్తే ఫ్యాన్స్ డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది గుర్తించే సమయం తక్కువగా ఉన్నా బ్రో టీమ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చింది. పొలిటికల్ గా హైలైట్ అవ్వాల్సిన టైంలో సినిమాల గురించి ఎందుకనేదే ఈ స్ట్రాటజీ
ఇక రెండో రీజన్ ఆదిపురుష్ విడుదల. తెలుగు హక్కులను నూటా ఎనభై కోట్లకు కొన్న పీపుల్స్ మీడియా దాని ప్రమోషన్లు, బిజినెస్ వ్యవహారాలు, లాభనష్టాలు తదితర పనుల్లో చాలా బిజీగా ఉంది. అందుకే బ్రో మీద ఎక్కువ ఫోకస్ లేదు. ఇప్పుడు వారాహి యాత్రకు బ్రేక్ తో పాటు ఆదిపురుష్ ఫైనల్ రన్ కు దగ్గర పడటంతో బ్రో ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. ఒక్క టీజరే బిజినెస్ ని అమాంతం రెట్టింపు చేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు . ప్రస్తుతానికి రేట్లయితే భారీగా చెబుతున్నారట. మొత్తానికి జూలై 28 దాకా బ్రో తాలూకు సందడితో ఆన్ లైన్ హోరెత్తిపోవడం ఖాయం
This post was last modified on June 27, 2023 4:12 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…