బ్లాక్ బస్టర్ సినిమాని కొనేవాళ్ళు లేరు

ఎంత ప్రాపగాండా సినిమాగా విమర్శలు వచ్చినా భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించిన ది కేరళ స్టోరీ ఇప్పటిదాకా ఓటిటి రిలీజ్ జరుపుకోలేదు. మొన్న 23న జీ ఫైవ్ స్ట్రీమింగని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తుత్తి న్యూసే. తాజా అప్ డేట్ ప్రకారం అసలు డిజిటల్ రైట్స్ ఇంకా అమ్మనేలేదట. నిర్మాతలు 75 కోట్ల దాకా ఆశిస్తుండటంతో ఓటిటిలు భయపడి వెనుకడుగు వేశాయని ముంబై టాక్. నిజానికి అంత మొత్తాన్ని స్టార్ హీరోలకే డిమాండ్ చేయరు. కేరళ స్టోరీ ఎంత సక్సెస్ అయినా బుల్లితెరపై ఆడటం గురించి అనుమానాలున్నాయి .

ఇలా జరగడానికి కారణం ఉంది. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఓటిటిలోనూ జనం ఎగబడి చూస్తారని నిర్మాతలు భావించారు. కానీ అలా జరగలేదు. వ్యూస్ అయితే కోట్లలో వచ్చాయి కానీ సదరు కంపెనీ చాలా ఆశించింది. పైగా స్మార్ట్ ఫోన్, టీవీల్లో చూశాక అసలైన నెగటివిటీ బయటికి వచ్చింది. రికార్డుల సంగతేమో కానీ ఆశించిన ఆదాయం రాలేదని వాపోయింది. ఇప్పుడు ది కేరళ స్టోరీకి అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పైగా రిలీజైన టైంలో వారం పది రోజుల హడావిడి తప్ప తరువాత అది కూడా పూర్తిగా సైలెంట్ అయ్యింది.

ఈ టాపిక్ దెబ్బకు ది కేరళ స్టోరీ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ దీన్ని బుల్లితెరపై చూసేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ బాగా ఆలస్యం తప్పేలా లేదు. ఓటిటికే ఇలా ఉంటే ఇక శాటిలైట్ గురించి చెప్పనక్కర్లేదు. అన్నట్టు ఈ టీమ్ మరోసారి చేతులు కలిపి బస్తర్ అనే కొత్త మూవీ అనౌన్స్ చేసింది.  దేశాన్ని సునామిలా ముంచుకొచ్చే ఓ నగ్న సత్యాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. సుదిప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ లాల్ షా నిర్మించబోతున్నారు. కమ్యూనిస్ట్ ప్లస్ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఏదో ఎంచుకున్నారు