ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ వైజయంతి మూవీస్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు చిన్న వీడియోతో కూడిన అనౌన్స్ మెంట్ ని ఇచ్చారు. ఈ వార్త కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ యూనిట్ తరఫున ధ్రువీకరణ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత అనుమానంతో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది కాబట్టి అంచనాలు రెట్టింపు వేగంతో పరుగులు పెట్టడం ఖాయం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కమల్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు.
ఆగస్ట్ నుంచి కమల్ భాగానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ప్రభాస్ కమల్ లను ఒకే ఫ్రేమ్ లో చూసుకోవడం కన్నా కావాల్సింది ఏముంటుంది. సుమారు అయిదు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అనుపమ్ ఖేర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. వీళ్లకు కమల్ తోడవ్వడం కంటే ఎలివేషన్ వేరే ఏమొస్తుంది. నిజానికి సోలో హీరోగా తప్ప ఇతరుల సినిమాల్లో పాత్రలు వేయడం కమల్ ఎప్పుడో మానేశారు. కానీ దీనికి ఓకే చెప్పారంటే నాగ అశ్విన్ ఏ రేంజ్ లో క్యారెక్టర్ ని డిజైన్ చేశారో.
వచ్చే ఏడాది జనవరి 12 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ప్రాజెక్ట్ కె ఆ లక్ష్యాన్ని చేరుకోగలదా లేదానేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా షూట్ చాలా బ్యాలన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ సమయం కావాలి. మరి చేతిలో ఉన్న ఆరు నెలలతో ఆ డెడ్ లైన్ మీట్ కావడం చాలా కష్టం. అందుకే 2024 వేసవి లేదా దసరాకి మారొచ్చనే వార్త ఉంది కానీ అదెంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ప్రాజెక్ట్ కె మీదున్న హైప్ ని చూస్తుంటే వెయ్యి కోట్ల బిజినెస్ సాధ్యమే అనిపిస్తోంది మరి.
This post was last modified on June 25, 2023 1:01 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…